ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎగుమతుల్లో మళ్లీ క్షీణత

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:29 AM

వరుసగా రెండు నెలల పాటు సానుకూల వృద్ధిని నమోదు చేసిన ఎగుమతుల రంగం మే నెలలో మరోసారి ప్రతికూల వృద్ధిలోకి దిగజారింది. ప్రపంచ విపణిలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల...

మే నెలలో 2.17% పతనం

న్యూఢిల్లీ: వరుసగా రెండు నెలల పాటు సానుకూల వృద్ధిని నమోదు చేసిన ఎగుమతుల రంగం మే నెలలో మరోసారి ప్రతికూల వృద్ధిలోకి దిగజారింది. ప్రపంచ విపణిలో పెట్రోలియం ఉత్పత్తుల ధరల తగ్గుదల, అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావంతో మే నెల ఎగుమతులు 2.17ు పడిపోయి 3,873 కోట్ల డాలర్లకు (రూ.3.33 లక్షల కోట్లు) పరిమితం అయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాణిజ్య లోటు 2,188 కోట్ల డాలర్లకు (రూ.1.88 లక్షల కోట్లు) తగ్గింది. దిగుమతులు కూడా 1.7ు తగ్గి 6,061 కోట్ల డాలర్లుగా (రూ.5.21 లక్షల కోట్లు) నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఏప్రిల్‌-మే నెలల్లో మొత్తం ఎగుమతులు 3.11 శాతం పెరిగి 7,719 కోట్ల డాలర్లకు (రూ.66.4 లక్షల కోట్లు) చేరగా దిగుమతులు 8 శాతం వృద్ధితో 12,552 కోట్ల డాలర్లుగా (రూ.10.79 లక్షల కోట్లు) నమోదయ్యాయి. రెండు నెలల వాణిజ్య లోటు 4,833 కోట్ల డాలర్లుగా (రూ.4.16 లక్షల కోట్లు) ఉంది. మే నెలలో ప్రతికూల వృద్ధి నమోదైన వస్తువుల్లో బియ్యం, ఇనుప ఖనిజం, వజ్రాభరణాలు, ఇంజనీరింగ్‌, కొన్ని రకాల టెక్స్‌టైల్‌ ఉత్పత్తులు ఉన్నాయి. క్రూడాయిల్‌ దిగుమతులు 26.14ు, బంగారం దిగుమతులు 12.6ు తగ్గినప్పటికీ టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, రసాయనాలు, మెరైన్‌ ఉత్పత్తులు, ఫార్మా విభాగాల్లో మాత్రం సానుకూల వృద్ధి నమోదైంది.

టోకు ద్రవ్యోల్బణం 0.39%

ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం మే నెలలో 0.39 శాతానికి దిగి వచ్చింది. ఇది 14 నెలల కనిష్ఠ స్థాయి. గత ఏడాది ఇది మే నెలలో 2.74 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 21.62 శాతం, ఇంధన విభాగం 2.27 శాతంతో ప్రతి ద్రవ్యోల్బణ స్థితిని నమోదు చేశాయి.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 01:30 AM