స్విస్ బ్యాంకుల్లో పెరిగిన భారత నిధులు
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:28 AM
స్విస్ బ్యాంకుల్లో మన దేశ నిధులు పెరుగుతున్నాయి. గత ఏడాది చివరికి ఇవి 350 కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌కు (సుమారు రూ.37,600 కోట్లు) చేరాయి. 2023తో పోలిస్తే ఇది మూడింతలు...
2024 నాటికి రూ.37,600 కోట్లు
న్యూఢిల్లీ/జ్యూరిచ్: స్విస్ బ్యాంకుల్లో మన దేశ నిధులు పెరుగుతున్నాయి. గత ఏడాది చివరికి ఇవి 350 కోట్ల స్విస్ ఫ్రాంక్స్‌కు (సుమారు రూ.37,600 కోట్లు) చేరాయి. 2023తో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ. అయిన మన దేశ ఘరానా పెద్దలు స్విస్ బ్యాంకుల్లో భద్రంగా దాచుకున్న సొమ్ములను ఇందులో కలప లేదు. అది ఎంత మొత్తం ఉంటుందనే విషయాన్నీ స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ అయిన స్విస్ నేషనల్ బ్యాంక్ వెల్లడించలేదు. అలాగే ఎన్‌ఆర్‌ఐలు, ఇతరులు ఇంకో దేశం నుంచి జమ చేసిన మొత్తాన్ని కూడా ఇందులో కలపలేదు. మన దేశానికి చెందిన ఆర్థిక సంస్థలు, కంపెనీలు తమ స్థానిక శాఖల ద్వారా జమ చేసిన మొత్తాన్ని మాత్రమే ప్రస్తుతానికి స్విస్ బ్యాంక్ వెల్లడించింది. ప్రసు ్తతం ఉన్న రూ.37,600 కోట్లలో దాదాపు పదో వంతు (సుమారు రూ.3,675 కోట్లు) భారత కంపెనీల ఖాతాదారుల ఖాతాల్లో ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ.
Also Read:
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
For More Business News
Updated Date - Jun 20 , 2025 | 05:28 AM