ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్‌ రాకెట్‌

ABN, Publish Date - May 13 , 2025 | 03:34 AM

భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో పాటు పరస్పర సుంకాలు తగ్గించుకునే దిశగా అమెరికా-చైనా మధ్య ఒప్పందం కుదరడంతో ఈక్విటీ మదుపరుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. వారు భవిష్యత్‌పై...

భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ... దూసుకుపోయిన స్టాక్‌ సూచీలు

  • ఇంట్రాడేలో 3,041 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

  • చివరికి 2,975 పాయింట్ల లాభంతో 82,429.90 వద్ద ముగిసిన సూచీ

  • 916.70 పాయింట్ల లాభంతో మళ్లీ 25,000కు చేరువైన నిఫ్టీ

రూ.16.25 లక్షల కోట్లు పెరిగిన సంపద

సూచీలకు ఇదే అతిపెద్ద ఒక్కరోజు లాభం

ముంబై: భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో పాటు పరస్పర సుంకాలు తగ్గించుకునే దిశగా అమెరికా-చైనా మధ్య ఒప్పందం కుదరడంతో ఈక్విటీ మదుపరుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. వారు భవిష్యత్‌పై భయాందోళనలు వీడి కొనుగోళ్లను పోటెత్తించడంతో ప్రామాణిక సూచీలు నింగిలోకి రాకెట్‌లా దూసుకెళ్లాయి. సోమవారం ట్రేడింగ్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 2,975.43 పాయింట్లు (3.74శాతం) లాభపడి 82,429.90 వద్దకు చేరింది. సూచీకి 7 నెలలకు పైగా గరిష్ఠ ముగింపు స్థాయి ఇది. ఒక దశలో సూచీ 3,041.5 పాయింట్లు (3.82 శాతం) ఎగబాకి 82,495.97 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం ఒక దశలో 936.8 పాయింట్ల (3.90శాతం) వృద్ధితో 24,944.80 వద్ద ఇంట్రా డే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 916.70 పాయింట్ల (3.82 శాతం) లాభంతో 24,924.70 వద్ద ముగిసింది. సంఖ్య పరంగా సూచీలకు ఇప్పటివరకిదే అతిపెద్ద ఒక్క రోజు లాభం. గత రికార్డు లాభం 2024 జూన్‌ 3న నమోదైంది. ఆ రోజున సెన్సెక్స్‌ 2,507.45 పాయింట్లు, నిఫ్టీ 733.20 పాయింట్లు లాభపడ్డాయి. శాతం పరంగా, సూచీలకు 2021 ఫిబ్రవరి 1 (4 ఏళ్లకు పైగా కాలంలో) తర్వాత ఇదే అతిపెద్ద లాభం. ఆ రోజున సూచీలు 4.7 శాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి.


  • బుల్‌ ర్యాలీలో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజే రూ.16.15 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.432.56 లక్షల కోట్లకు (5.05 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.

  • సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 28 రాణించాయి. ఇన్ఫోసిస్‌ 7.91 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా అవతరించింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌ 6 శాతానికి పైగా లాభపడగా.. ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌ 5 శాతానికి పైగా పెరిగాయి. మార్కెట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4.27 శాతం, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ 3.67 శాతం వృద్ధి చెందాయి. సన్‌ఫార్మా, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ మాత్రం 3 శాతానికి పైగా నష్టపోయాయి.

  • ప్రధాన కంపెనీలతో పాటు చిన్న, మధ్య స్థాయి షేర్లలోనూ మదుపరులు దూకుడుగా కొనుగోళ్లు జరిపారు. దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 4.18 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3.85 శాతం పుంజుకున్నాయి. బీఎ్‌సఈలోని రంగాల వారీ సూచీలన్నీ లాభపడ్డాయి. ఐటీ, ఫోకస్డ్‌ ఐటీ సూచీలు ఏకంగా 6.75 శాతం వరకు ఎగబాకాయి. రియల్టీ, మెటల్‌, టెక్నాలజీ, యుటిలిటీస్‌ ఇండెక్స్‌లు 5 శాతానికి పైగా పెరిగాయి.

  • భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు చల్లారినప్పటికీ, రక్షణ రంగ షేర్లు వరుసగా రెండో రోజూ పెరిగాయి. యాక్సి్‌సకేడ్స్‌ టెక్నాలజీస్‌ షేరు 5 శాతం లాభపడగా.. డేటా ప్యాటర్న్స్‌ లిమిటెడ్‌ 3.88 శాతం, మిశ్ర ధాతు నిగమ్‌ 3.40 శాతం, భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ 2.23 శాతం, గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ 1.37 శాతం ఎగబాకాయి. డ్రోన్‌ కంపెనీల్లో ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ 6.09 శాతం, డ్రోనాచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్‌ 4.99 శాతం పుంజుకున్నాయి.

  • బీఎ్‌సఈలో మొత్తం 4,254 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,541 లాభపడ్డాయి. 582 నష్టపోగా.. 131 యథాతథంగా ముగిశాయి. 110 కంపెనీల స్టాక్స్‌ సరికొత్త ఏడాది గరిష్ఠానికి చేరాయి.

  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.1,246.48 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ.1,448.37 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.


గోల్డ్‌.. ఢమాల్‌!

ఉద్రిక్తతలు, అనిశ్చితులు తగ్గుముఖం పట్టడంతో ప్రతికూలతల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి అంతర్జాతీయంగా గిరాకీ భారీగా తగ్గింది. దాంతో వీటి ధరలు దేశీయంగానూ భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర ఏకంగా రూ.3,400 తగ్గి రూ.96,550కి దిగివచ్చింది. గడిచిన 10 నెలల్లో బంగారానికి ఇదే అతిపెద్ద ఒక్కరోజు తగ్గుదల. 2024 జూన్‌ 23న తులం బంగారం రూ.3,350 తగ్గింది. కాగా, కిలో వెండి రూ.200 తగ్గుదలతో రూ.99,700 ధర పలికింది. అమెరికా-చైనా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 3 శాతానికి పైగా క్షీణించి 3,218 డాలర్లకు పడిపోగా.. సిల్వర్‌ 32.33 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

65 డాలర్ల పైకి క్రూడ్‌: అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర 2.88 శాతం పెరిగి 65.75 డాలర్లకు ఎగబాకింది. అమెరికా-చైనా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పం దం కుదరడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మళ్లీ జోరందుకోవచ్చని, తత్ఫలితంగా ముడిచమురు గిరాకీ మళ్లీ పుంజుకోనుందన్న అంచనాలు ఇందుకు కారణమయ్యాయి.

ఇవి కూడా చదవండి

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 03:34 AM