ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బంగ్లా ఆంక్షలకు ప్రతి ఆంక్షలు

ABN, Publish Date - May 19 , 2025 | 04:42 AM

భారత-బంగ్లాదేశ్‌ మధ్య వైరం ముదురుతోంది. ఆ దేశం నుంచి దిగుమతయ్యే రెడీమేడ్‌ దుస్తులు, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్ధాలు, ప్లాస్టిక్‌ వస్తువుల దిగుమతులను భూమార్గం ద్వారా కాకుండా కోల్‌కతా లేదా ముంబై సమీపంలోని..

  • చెల్లుకు చెల్లు చెప్పిన భారత్‌

  • దేశీయ ఎంఎ్‌సఎంఈలకు ఊరట

న్యూఢిల్లీ: భారత-బంగ్లాదేశ్‌ మధ్య వైరం ముదురుతోంది. ఆ దేశం నుంచి దిగుమతయ్యే రెడీమేడ్‌ దుస్తులు, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్ధాలు, ప్లాస్టిక్‌ వస్తువుల దిగుమతులను భూమార్గం ద్వారా కాకుండా కోల్‌కతా లేదా ముంబై సమీపంలోని నవసేనా రేవుల ద్వారా మాత్రమే అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత నూలు, బియ్యం దిగుమతులతో పాటు అనేక వస్తువులపై బంగ్లాదేశ్‌ ఇటీవల ఇదే తరహా ఆంక్షలు విధించింది. ఎవరైనా భారత ఎగుమతిదారు భూమార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు సరుకులు ఎగుమతి చేయాలంటే ప్రతి కిలోమీటరుకు టన్నుకు 1.8 టాకాల చొప్పున ప్రత్యేక ఫీజు విధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం బంగ్లా దిగుమతులపై ఈ ఆంక్షలు విధించింది. ఈ నిషేధం ప్రభావం మన దేశానికి బంగ్లాదేశ్‌ చేసే 42 శాతం (77 కోట్ల డాలర్లు) ఎగుమతులపై ఉంటుందని అంచనా.


ఎంఎ్‌సఎంఈలకు ఊరట

ఈ నిషేధం ప్రభావం ఈశాన్య రాష్ట్రాలు, దేశంలో ఇతర ప్రాంతాల్లో రెడీమేడ్‌ దుస్తులు తయారు చేసే దేశీయ ఎంఎ్‌సఎంఈలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. నిజానికి బంగ్లాదేశ్‌ చౌకగా చైనా నుంచి వస్త్రాలు దిగుమతి చేసుకుని వాటిని దుస్తులుగా మార్చి మన దేశానికి జీరో డ్యూటీతో ఎగుమతి చేస్తోంది. దీనికి చెక్‌ పెట్టాలని దేశీయ పరిశ్రమ ముఖ్యంగా ఎంఎ్‌సఎంఈలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ‘మేము ఎప్పటి నుంచో దీని గురించి అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశీయ పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’ అని దుస్తుల ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) జాతీయ వైస్‌ చైర్మన్‌ ఏ శక్తివేల్‌ అన్నారు.


బంగ్లాకే అధిక నష్టం

ఈ పరస్పర ఆంక్షలతో బంగ్లాదేశ్‌ అధికంగా నష్టపోతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ దేశ ప్రధాన ఎగుమతులైన దుస్తులు, ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్ధాలను భూమార్గం ద్వారా కోల్‌కతా, లేదా ముంబైకి తరలించి విదేశాలకు ఎగువుమతి చేసేది. దీంతో ఈ రేవులు బంగ్లాదేశ్‌ సరుకులతో నిండిపోయి తమ సరుకులు నిల్వ చేసేందుకు కనీసం చోటు కూడా దొరకడం లేదని భారత ఎగమతిదారులు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. గత ఏడాది బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టి మహ్మద్‌ యూనస్‌ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారం చేపట్టాక అక్కడ భారత వ్యతిరేకత ప్రబలిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్‌పై ఆర్థిక యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..

Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్

Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..

EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 19 , 2025 | 04:42 AM