ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌లో పన్నుల భారం ఎక్కువ

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:58 AM

భారత విమానయాన రంగం పై ప్రభుత్వం విఽధిస్తున్న పన్నులపై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. పన్నుల నిర్వచనంలోనూ స్పష్టత లేకుండా పోతోందని...

ఎయిర్‌పోర్టు చార్జీలూ ఎక్కువే

ఐఏటీఏ చీఫ్‌ విల్లీ వాల్ష్‌

న్యూఢిల్లీ: భారత విమానయాన రంగం పై ప్రభుత్వం విఽధిస్తున్న పన్నులపై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. పన్నుల నిర్వచనంలోనూ స్పష్టత లేకుండా పోతోందని ఐఏటీఏ వార్షిక సదస్సుకు హాజరైన ఐఏటీఏ డైరెక్టర్‌ జనరల్‌ విల్లీ వాల్ష్‌ తెలిపారు. ఈ విషయంలో స్పష్టత ఏర్పడితే తప్ప భారత్‌లో విమానయాన రంగం తన శక్తికి తగ్గట్టు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం లేదని స్పష్టం చేశారు. భారత విమానాశ్రయాల్లో వసూలు చేస్తున్న చార్జీలపైనా వాల్ష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో మరే దేశంలోనూ భారత ఎయిర్‌పోర్టుల్లో ఉన్నన్ని చార్జీలు లేవన్నారు. ఈ చార్జీలు విమానయాన సంస్థలకు భారం కాని స్థాయిలో ఉండాలన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నా భారత్‌లో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందన్నారు. ఈ విషయంలో భారత్‌ త్వరలోనే చైనాను మించిపోతుందని వాల్ష్‌ స్పష్టం చేశారు.


అద్భుత అవకాశాలు: వర్జిన్‌ అట్లాంటిక్‌

విమానయానానికి సంబంధించి భారత్‌ అద్భుత అవకాశాల గని అని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే వర్జిన్‌ అట్లాంటిక్‌ విమానయాన సంస్థ తెలిపింది. భారత-బ్రిటన్‌ ఎఫ్‌టీఏ నేపథ్యంలో సరుకు రవాణ కోసం భారత్‌కు మరిన్ని విమాన సర్వీసు ప్రారంభించబోతున్నట్టు ఆ సంస్థ సీఈఓ షాయ్‌ వీస్‌ చెప్పారు. అమెరికా తర్వాత ప్రస్తుతం భారత్‌ తమకు అతిపెద్ద మార్కెట్‌ అన్నారు.

భారత్‌ నుంచి ప్రస్తుతం ఏటా తమ విమానాల ద్వారా 10 లక్షల మంది ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తన సాంకేతిక వ్యవస్థలను ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో ఆధునీకరించేందుకు వర్జిన్‌ అట్లాంటిక్‌ సంస్థ టీసీఎ్‌సతో ఐఏటీఏ సదస్సు సందర్భంగా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్య ఒప్పందం ఏడేళ్ల పాటు అమల్లో ఉంటుంది.


మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 05:58 AM