Green Hydrogen Plan: హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్
ABN, Publish Date - Jul 17 , 2025 | 05:27 AM
ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కూడా హరిత బాట పట్టింది. ఇందు లో భాగంగా విశాఖపట్నంలోని తన రిఫైనరీ వద్ద ఏటా 5,000 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న హరిత ఉదజని...
కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓసియర్ ఎనర్జీ
ముంబై: ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కూడా హరిత బాట పట్టింది. ఇందు లో భాగంగా విశాఖపట్నంలోని తన రిఫైనరీ వద్ద ఏటా 5,000 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న హరిత ఉదజని (హైడ్రోజన్) ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. అబుదాబీ కేంద్రంగా పనిచేసే ఓసియర్ ఎనర్జీ ఈ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటు ఏర్పాటు కోసం ఎనిమిది కంటే ఎక్కువ కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే ఓసియర్ ఎనర్జీ కంపెనీ కిలో హరిత ఉదజనికి తక్కువలో తక్కువగా రూ.328 కోట్ చేయడం ద్వారా ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. విశాఖ హెచ్‌పీసీఎల్ వద్ద ఏర్పాటు చేసే హరిత ఉదజని ప్లాంటును ఓసియర్ ఎనర్జీయే ఏర్పాటు చేసి పాతికేళ్ల పాటు నిర్వహిస్తుంది. కాగా ఓసియర్ ఇప్పటికే గుజరాత్, ఒడిశాల్లో హరిత ఉదజని, అమ్మోనియా ప్లాంట్లు దక్కించుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 17 , 2025 | 05:30 AM