ద్వితీయ శ్రేణి నగరాల్లో నియామకాల జోరు
ABN, Publish Date - Jul 03 , 2025 | 04:54 AM
గత నెల దేశంలో వైట్ కాలర్ కొలువుల (ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు) నియామకాలు పుంజుకున్నా యి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం పెరిగినట్టు ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్...
ముంబై: గత నెల దేశంలో వైట్ కాలర్ కొలువుల (ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు) నియామకాలు పుంజుకున్నా యి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం పెరిగినట్టు ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ తెలిపింది. తన ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ ‘ఫౌండిట్.ఇన్’లో నమోదైన జాబ్ పోస్టింగ్స్ ఆధారంగా ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్ ఈ విషయం తెలిపింది. ఆ నివేదిక ప్రకారం ద్వితీయ శ్రేణి నగరాలు నియామకాల్లో ముందువరుసలో ఉన్నాయి. నియామకాలు కోయంబత్తూరులో 26 శాతం, నాగపూర్, నాసిక్ నగరాల్లో 24 శాతం చొప్పున పెరిగాయి. ఐటీ, బీఎ్‌ఫఎ్‌సఐ, తయారీ, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అధిక మొత్తంలో నియామకాలు చేశాయి. లాజిస్టిక్స్, రవాణ, ఇంధన రంగాల్లోనూ 38-42 శాతం మేరకు నియామకాలు పెరిగాయి. స్థిరమైన వృద్ధి, చక్కటి మౌలిక సదుపాయాలతో ద్వితీయ శ్రేణి నగరాల్లో కంపెనీల పెట్టుబడులు కూడా పెరుగుతున్నట్టు ఆ నివేదిక తెలిపింది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 03 , 2025 | 04:54 AM