ఇండస్ ఇండ్‌ను ఆదుకునేందుకు సిద్ధం అశోక్ హిందుజా
ABN, Publish Date - May 23 , 2025 | 04:19 AM
ఉన్నతోద్యోగుల అక్రమాలతో కష్టాల్లో ఉన్న ఇండ్‌సఇండ్ బ్యాంకును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు హిందుజా గ్రూప్ ప్రకటించింది. అవసరమైతే బ్యాంకుకు...
న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగుల అక్రమాలతో కష్టాల్లో ఉన్న ఇండ్‌సఇండ్ బ్యాంకును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు హిందుజా గ్రూప్ ప్రకటించింది. అవసరమైతే బ్యాంకుకు మరిన్ని నిధులు సమకూర్చేందుకూ సిద్ధంగా ఉన్నట్టు బ్యాంకు ప్రమోటర్ కంపెనీ ఐఐహెచ్‌ఎల్ చైర్మన్ అశోక్ హిందుజా ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల అక్రమాలతో బయటపడిన నష్టాన్ని సరిదిద్దేందుకు బ్యాంకు తాత్కాలిక మేనేజ్‌మెంట్ వేగంగా తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు.
కోలుకున్న షేర్లు: క్యూ4 ఆర్థిక ఫలితాలతో ఇండ్‌సఇండ్ బ్యాంకు షేర్లు బీఎ్‌సఈలో గురువారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న హిందుజా గ్రూప్ ప్రకటనతో కోలుకుంది. చివరికి 1.82 శాతం లాభంతో రూ.785.10 వద్ద ముగిసింది.
Also Read:
ఆ భావన ఇస్లాంలోనే కాదు.. హిందూమతంలోనూ ఉంది
పెద్దిరెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట..
For More Telangana News and Telugu News..
Updated Date - May 23 , 2025 | 04:19 AM