ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Revenue Growth: హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఆదాయం రూ. ,137 కోట్లు

ABN, Publish Date - Jul 18 , 2025 | 06:05 AM

హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,136.80 కోట్ల ఆదాయంపై రూ.40.54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం...

క్యూ1 లాభం రూ.41 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెరిటేజ్‌ ఫుడ్స్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,136.80 కోట్ల ఆదాయంపై రూ.40.54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం (రూ.1,032.67 కోట్లు)తో పోల్చితే ఆదాయం 10 శాతం వృద్ధి చెందగా లాభం మాత్రం 31 శాతం (రూ.58.42 కోట్లు) తగ్గింది. ఏప్రిల్‌- మే నెలల్లో అకాల వర్షాల కారణంగా అన్ని మార్కెట్లలో పెరుగు, బటర్‌మిల్క్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గటం పనితీరు ప్రభావం చూపించిందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వెల్లడించింది. అయితే జూన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనటం కొంతమేరకు కలిసివచ్చిందని పేర్కొంది. కాగా జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూలు తొలిసారిగా రూ.1,100 కోట్ల మార్కును అధిగమించాయని తెలిపింది. మరోవైపు ఈ కాలంలో వ్యయాలు కూడా రూ.958.90 కోట్ల నుంచి రూ.1,085.76 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. జూన్‌ త్రైమాసికంలో వ్యాపారపరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కంపెనీ తొలిసారిగా రూ.1,100 కోట్ల రెవెన్యూ మార్కును అధిగమించిందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా తెలిపారు. కంపెనీ వ్యాపార ఫండమెంటల్స్‌ పటిష్ఠంగా ఉన్నాయని, దీర్ఘకాలంలో మరింత వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐస్‌క్రీమ్‌ ప్లాంట్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. హెరిటేజ్‌ నోవాండెల్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎన్‌ఎఫ్‌పీఎల్‌)లో అదనంగా 44.4 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం లభించిందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ పేర్కొంది. ఈ కొనుగోలుతో హెచ్‌ఎన్‌ఎ్‌ఫపీఎల్‌లో కంపెనీ మొత్తం వాటా 94.4 శాతానికి చేరనుంది.

ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 06:05 AM