హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభంలో 7% వృద్ధి
ABN, Publish Date - Apr 20 , 2025 | 04:10 AM
గడచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ కాలానికి గాను బ్యాంక్ కన్సాలిడేటెడ్...
క్యూ4 లాభం రూ.18,835 కోట్లు
ఒక్కో షేరుకు రూ.22 డివిడెండ్
ముంబై: గడచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ కాలానికి గాను బ్యాంక్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.18,835 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 7 శాతం ఎక్కువ. కాగా స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన ఈ కాలంలో రూ.17,616 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా సమీక్షా త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం రూ.80,639 కోట్ల నుంచి రూ.89,488 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 1.24 శాతం నుంచి 1.33 శాతానికి పెరగా నికర ఎన్‌పీఏలు కూడా 0.33 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగాయి. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.22 చొప్పున (2,200 శాతం) డివిడెండ్‌ను బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 20 , 2025 | 04:10 AM