ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వడ్డీరేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బీఓబీ

ABN, Publish Date - Jun 09 , 2025 | 05:37 AM

దేశంలో రుణాలపై వడ్డీరేట్ల కోత కొనసాగుతోంది. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) రెపో ఆధారిత రుణ వడ్డీరేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) అర శాతం తగ్గించింది. ఇక నుంచి తన ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 8.15 శాతం...

న్యూఢిల్లీ: దేశంలో రుణాలపై వడ్డీరేట్ల కోత కొనసాగుతోంది. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) రెపో ఆధారిత రుణ వడ్డీరేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) అర శాతం తగ్గించింది. ఇక నుంచి తన ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ 8.15 శాతం నుంచి ప్రారంభమవుతుందని బీఒబీ తెలిపింది. ఈ తగ్గింపు శనివారం నుంచే అమలులోకి వచ్చినట్టు పేర్కొంది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ మాత్రం అదనపు నిధుల సమీకరణ వ్యయం ఆధారంగా వసూలు చేసే వడ్డీరేటును (ఎంసీఎల్‌ఆర్‌) మాత్రమే 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గిస్తున్నట్టు ప్రకటించిది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక, ద్రవ్య విధానంలో ఆర్‌బీఐ రెపోరేటు అర శాతం, సీఆర్‌ఆర్‌ ఒక శాతం తగ్గించింది. దాంతో బ్యాంకులు వరుస పెట్టి తమ రెపో ఆధారిత రుణాల వడ్డీరేట్లు తగ్గిస్తున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), యూకో బ్యాంకులు ఇప్పటికే వడ్డీరేట్లు తగ్గించాయి.

ఇవీ చదవండి:

దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా

4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 05:37 AM