ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Financial performance: తగ్గిన హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:24 AM

టెక్‌ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో 9.7 శాతం క్షీణించి రూ.3,843 కోట్లకు పరిమితమైంది...

క్యూ1లో 9.7% క్షీణత. రూ.3,843 కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో 9.7 శాతం క్షీణించి రూ.3,843 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,257 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 8.1 శాతం పెరిగి రూ.28,057 కోట్ల నుంచి రూ.30,349 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోల్చితే మాత్రం లాభం 10.7ు క్షీణించగా ఆదాయం నామమాత్రంగా 0.3ు పెరిగింది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను కంపెనీ 3-5 శాతానికి పరిమితం చేసింది. స్థిర కరెన్సీ విలువల ఆధారంగా సేవల విభాగం వ్యాపారం 4.5ు వృద్ధిని సాధించిందని, వార్షిక ప్రాతిపదికన ఆదాయం 3.7ు వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ అన్నారు. అయితే తక్కువ వినియోగం; జెనరేటివ్‌ ఏఐ, జీటీఎం విభాగాల్లో అదనపు పెట్టుబడుల కారణంగా నిర్వహణాపరమైన మార్జిన్‌ 16.3 శాతం ఉన్నట్టు ఆయన చెప్పారు.

రూ.12 మధ్యంతర డివిడెండ్‌: 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఇందుకు రికార్డు తేదీని జూన్‌ 18గా నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీన వాటాదారులకు డివిడెండు చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

నీ వయస్సు అయిపోయింది.. అందుకే..

ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 05:24 AM