ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లోకి టాటా హారియర్‌ ఈవీ

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:54 AM

టాటా మోటార్స్‌.. మార్కెట్లోకి హారియర్‌ ఈవీని తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. హారియర్‌ ఈవీ ప్రారంభ ధర రూ.21.49 లక్షలు...

ప్రారంభ ధర రూ.21.49 లక్షలు

ముంబై: టాటా మోటార్స్‌.. మార్కెట్లోకి హారియర్‌ ఈవీని తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఒకసారి చార్జింగ్‌తో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. హారియర్‌ ఈవీ ప్రారంభ ధర రూ.21.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). జూలై 2వ తేదీ నుంచి దీని బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి. నెలకి 25,000 వాహనాలు అమ్ముడుపోతున్న ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఇది సహాయకారి అవుతుందని ఈ కారు విడుదల సందర్భంగా టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర అన్నారు. హారియర్‌ ఈవీతో ఆఫ్‌ రోడ్‌ ప్రయాణాలపై ఆసక్తి గల కొత్త శ్రేణి కస్టమర్లను తాము ఆకర్షించ వచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది ఆల్‌ వీల్‌ డ్రైవ్‌, 504 నానోమీటర్ల టార్క్‌తో అందుబాటులోకి వస్తోందని ఆయన అన్నారు. హారియర్‌.ఈవీ 75 కిలోవాట్‌ ఆప్షన్‌ సహా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులో ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్‌లకు జీవితకాల వారెంటీ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఆటో పార్క్‌ అసిస్ట్‌, 6 టెర్రైన్‌ మోడ్‌, 55 కనెక్టెడ్‌ ఫీచర్లు హారియర్‌.ఈవీ ప్రత్యేకతలు. కేవలం 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది.

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 05:54 AM