CoinDCX Hack: కాయిన్‌డీసీఎక్స్‌పై సైబర్ దాడి
ABN, Publish Date - Jul 21 , 2025 | 02:29 AM
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ ఎక్స్ఛేంజీలను వదలడం లేదు. భారత్‌లో క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్ చేసే వారికి సేవలందించే...
రూ.378 కోట్లు గాయబ్
న్యూఢిల్లీ: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ ఎక్స్ఛేంజీలను వదలడం లేదు. భారత్‌లో క్రిప్టోకరెన్సీల్లో ట్రేడింగ్ చేసే వారికి సేవలందించే కాయిన్‌డీసీఎక్స్‌పైనా హ్యాకర్లు దాడి చేసి 4.42 కోట్ల డాలర్ల (సుమారు రూ.378 కోట్లు) కొట్టేశారు. అయితే ఇది తమ అంతర్గత ఖాతా సొమ్ము అని, ఖాతాదారుల నిధులకు ఎలాంటి ఢోకా లేదని కాయిన్‌డీసీఎక్స్ ప్రకటించింది. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తాన్ని తమ ట్రెజరీ రిజర్వుల నుంచి భర్తీ చేసుకుంటామని పేర్కొంది.
ఇవీ చదవండి:
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా
Updated Date - Jul 21 , 2025 | 02:29 AM