ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలంటే ?

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:41 AM

జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలన్న విషయం తెలిసిందే. అయితే ఈ దరఖాస్తుదారుల్లో వివిధ వర్గాల వారు ఉంటారు. అంటే ప్రొపైటర్‌, పార్ట్‌నర్‌షిప్‌, కంపెనీ, ట్రస్ట్‌, సొసైటీ మొదలైనవి....

జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ కావాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలన్న విషయం తెలిసిందే. అయితే ఈ దరఖాస్తుదారుల్లో వివిధ వర్గాల వారు ఉంటారు. అంటే ప్రొపైటర్‌, పార్ట్‌నర్‌షిప్‌, కంపెనీ, ట్రస్ట్‌, సొసైటీ మొదలైనవి. దీనినే ‘కానిస్టిట్యూషన్‌ ఆఫ్‌ బిజినెస్‌’ అంటారు. మరి వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించాలి? అలాగే సొంత స్థలంలో వ్యాపారం చేసే వారు కొంతమంది కాగా, అద్దె స్థలంలో వ్యాపారం చేసే వారు మరికొందరు ఉంటారు. అలాకాకుండా, వ్యాపారం జరిగే ప్రదేశం కుటుంబ సభ్యుల్లో ఒకరి పేరు మీద ఉంటే.. వ్యాపారం కుటుంబ సభ్యుల్లోనే మరొకరి పేరు మీద ఉండవచ్చు. మరి ఇలాంటి సందర్భాల్లో ఆధారాల కింద ఎలాంటి డాక్యుమెంట్స్‌ సమర్పించాలనే విషయంలో కొంత గందరగోళం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాలు మీకోసం..

మొదటిది, సొంత స్థలంలో వ్యాపారం చేస్తుంటే.. అంటే, రిజిస్ట్రేషన్‌లో చూపిన ప్రిన్సిపల్‌ ప్లేస్‌ ఆఫ్‌ బిజినె్‌సలో చూపిన బిల్డింగ్‌ సొంతది అయి ఉంటే.. తగు వివరాలతో కూడిన లేటెస్ట్‌ ప్రాపర్టీ ట్యాక్స్‌ రసీదు, ఎలక్ట్రిక్‌ బిల్‌ అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. లేదంటే వాటర్‌ బిల్‌ కూడా ఇవ్వవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం లేదా మునిసిపాలిటీ, పంచాయతీ ద్వారా సదరు బిల్డింగ్‌ యాజమాన్యాన్ని ధ్రువీకరిస్తూ జారీ చేయబడిన ఎలాంటి డాక్యుమెంట్‌ అయినా అప్‌లోడ్‌ చేయవచ్చు.


ఒకవేళ ప్రిన్సిపల్‌ ప్లేస్‌ ఆఫ్‌ బిజినె్‌సలో చూపిన బిల్డింగ్‌ అద్దెకు తీసుకున్నది అయినట్లయితే, రెంట్‌ లేదా లీజు డీడ్‌ అప్‌లోడ్‌ చేయటంతో పాటుగా భవన యజమానికి సంబంధించిన యాజమాన్యాన్ని ఽధ్రువీకరించే డాక్యుమెంట్‌ అంటే ప్రాపర్టీ టాక్స్‌ రసీదు, ఎలక్ట్రిసిటీ బిల్‌, ఇవ్వాల్సి ఉంటుంది లేదా ఇంతకు ముందే చెప్పినట్లు యాజమాన్యాన్ని ధ్రువీకరిస్తూ జారీ చేయబడిన ఎలాంటి డాక్యుమెంట్‌ అయినా అప్‌లోడ్‌ చేయవచ్చు. అయితే, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రెంట్‌ లేదా లీజు డీడ్‌ రిజిస్టర్‌ చేసి ఉంటే పైన తెలిపిన వివరాలు సరిపోతాయి. ఒకవేళ రిజిస్టర్‌ చేసి ఉండకపోతే స్థల యజమానికి సంబంధించిన ఆధారాన్ని (ఐడెంటిటీ ప్రూఫ్‌) కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఇకపోతే వ్యాపార స్థలం కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు సంబంధించినదై ఉండి.. ఎలాంటి అద్దె లేదా లీజు గానీ లేని దైతే స్థల యజమాని నుంచి దీనికి సంబంధించి ‘సమ్మతి’తో కూడి న పత్రం (కన్సెంట్‌ లెటర్‌)తో పాటు స్థల యజమానికి సంబంధించిన ఆధారాన్ని (ఐడెంటిటీ ప్రూఫ్‌) కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా పైన తెలిపినట్లుగా యాజమాన్యాన్ని ధ్రువీకరించే ఆధారాలు కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.


ఇక, కానిస్టిట్యూషన్‌ ఆఫ్‌ బిజినె్‌సకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ అంటే పార్ట్‌నర్‌షిప్‌ వ్యాపారానికి సంబంధించి పార్ట్‌నర్‌షిప్‌ డీడ్‌ ఇవ్వవలసి ఉండగా..కంపెనీ, సొసైటీ, ట్రస్ట్‌లకు సంబంధించి రుజువులను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే డాక్యుమెంట్స్‌, ఫొటోలు స్పష్టంగా ఉండేట్లు చూసుకోవటం ముఖ్యం.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - Apr 27 , 2025 | 01:41 AM