ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీ ఎస్ టీ ఎగవేతలు ఐదేళ్లలో రూ 7 లక్షల 08 కోట్లు

ABN, Publish Date - Aug 05 , 2025 | 05:48 AM

జీఎ్‌సటీ కాలంలోనూ పన్ను ఎగవేతలు యఽ దేచ్ఛగా సాగుతున్నాయి. గత ఐదేళ్లలో (2020-25) 91,370 కేసుల్లో రూ.7.08 లక్షల కోట్ల జీఎ్‌సటీ ఎగవేతలను కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని క్షేత్ర స్థాయి జీఎ్‌సటీ అధికారులు గుర్తించారు...

ఐటీసీ పేరుతోనూ బురిడీ

న్యూఢిల్లీ: జీఎ్‌సటీ కాలంలోనూ పన్ను ఎగవేతలు యఽ దేచ్ఛగా సాగుతున్నాయి. గత ఐదేళ్లలో (2020-25) 91,370 కేసుల్లో రూ.7.08 లక్షల కోట్ల జీఎ్‌సటీ ఎగవేతలను కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని క్షేత్ర స్థాయి జీఎ్‌సటీ అధికారులు గుర్తించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం వెల్లడించారు. గత ఐదేళ్లలో వ్యాపారులు, వ్యాపా ర సంస్థలు, కంపెనీలు ఎగవేసిన రూ.7.08 లక్షల కోట్ల జీఎస్‌టీ కేసుల్లో ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) వాటానే రూ.2.79 లక్షల కోట్ల వరకు ఉందని మంత్రి చెప్పారు. ఐతే గత ఐదేళ్లలో స్వచ్ఛంద డిపాజిట్‌ పథకం ద్వారా రూ.1.29 లక్షల కోట్ల జీఎ్‌సటీ ఎగవేతల సొమ్మును అధికారులు రాబట్టగలిగారు.

ఎగవేతల తీరు

2024-25 ఆర్థిక సంవత్సరంలో 33,056 కేసుల్లో రూ.2.23 లక్షల కోట్ల జీఎ్‌సటీ ఎగవేతలను అధికారులు గుర్తించారు. ఇందులో 15,283 కేసులు ఐటీసీ ఎగవేతలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ ఎగవేతల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.58,772 కోట్ల వరకు గండి పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ రూ.2.30 లక్షల జీఎ్‌సటీ ఎగవేతలకు సంబంధించిన కేసులను సీజీఎ్‌సటీ అధికారులు గుర్తించారు. ఇందులో ఐటీసీ స్వాహా రూ.36,374 కోట్ల వరకు ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.32 లక్షల కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.73,238 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.49,384 కోట్ల జీఎ్‌సటీ ఎగవేత కేసులను అధికారులు గుర్తించారు.

కట్టడి చర్యలు

జీఎ్‌సటీ ఎగవేతలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్య లు చేపట్టింది. ఇందులో భాగంగా ఇ-ఇన్వాయిసింగ్‌, జీఎస్‌టీ అనలిటిక్స్‌ వంటి డిజిటైజేషన్‌ చర్యలతో పాటు నిఘాను పటిష్టం చేయడం, రిటర్న్‌ల స్ర్కూటినీ చేపట్టినట్టు పంకజ్‌ చౌదరి చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సీజీఎ్‌సటీ రూపంలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు నికరంగా రూ.10.26 లక్షల కోట్లు చేరింది. సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఇది (రూ.10.62 లక్షల కోట్లు) 96.7 శాతానికి సమానమని మంత్రి తెలిపారు.

రూ.47.12 కోట్ల ఎగవేతల గుట్టు రట్టు

ఐరన్‌, స్టీలు వ్యాపారంలో ఉన్న ఒక ఢిల్లీ వ్యాపారి బోగస్‌ ఇన్‌వాయి్‌సలతో రూ.47.12 కోట్ల ఐటీసీ స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘరానా పెద్ద మనిషి అసలు వస్తువులే సరఫరా చేయకుండా బోగస్‌ ఇన్వాయి్‌సలతో ఈ మొత్తాన్ని స్వాహా చేసినట్టు అధికారులు చెప్పారు. పక్కా సమాచారంతో దర్యాప్తు చేసి అధికారులు ఇతడిని అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 05:48 AM