ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GST: జీఎస్‌టీ వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లు

ABN, Publish Date - Jul 02 , 2025 | 05:04 AM

ఈ ఏడాది జూన్‌లో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం వృద్ధితో రూ.1.84 లక్షల కోట్లకు చేరాయి. అయితే, ఈ ఏప్రిల్‌, మే నెలల్లో...

జూన్‌లో 6.2 శాతం వృద్ధి నమోదు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం వృద్ధితో రూ.1.84 లక్షల కోట్లకు చేరాయి. అయితే, ఈ ఏప్రిల్‌, మే నెలల్లో నమోదైన రూ.2 లక్షల కోట్లకు పైగా వసూళ్లతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. 2024 జూన్‌లో జీఎస్‌టీ స్థూల ఆదాయం రూ.1.74 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు పెరగగా.. మే నెలలో రూ.2.01 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత నెలలో జీఎస్‌టీ రిఫండ్లు 28.4 శాతం పెరిగి రూ.25,491 కోట్లకు చేరాయి. దాంతో, జీఎస్‌టీ నికర వసూళ్లు రూ.1.59 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత జూన్‌తో పోలిస్తే, నికర ఆదాయంలో 3.3 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే మాత్రం 8.48 శాతం తగ్గాయి.

తొమ్మిదో వసంతంలోకి జీఎస్‌టీ: జీఎస్‌టీ చట్టం అమలులోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయ్యాయి. మంగళవారం తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. జీఎ్‌సటీ దేశ ఆర్థిక దృశ్యాన్ని పునర్నిర్మించిన మైలురాయు సంస్కరణ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ‘‘నిబంధనల భారాన్ని తగ్గించడం ద్వారా దేశంలో వ్యాపార నిర్వహణను, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల కార్యకలాపాలను మరింత మెరుగుపరిచింది. అంతేకాదు, ఆర్థిక వృద్ధికి చోదకంగా మారింది’’ అని ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ (గతంలో ట్విటర్‌)లో ప్రధాని పోస్ట్‌ చేశారు.

జీఎ్‌సటీ ఇకపై సులభతర వ్యాపార నిర్వహణను ప్రోత్సహించడం, పన్ను చెల్లింపుదారుల్లో బలమైన సమ్మతి, ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంపై దృష్టిసారించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దేశవ్యాప్తంగా ఏకరీతి పరోక్ష పన్నుల విధానాన్ని అమలు చేసేందుకు 17 రకాల స్థానిక పన్నులు, 13 రకాల సుంకాల విలీనం ద్వారా రూపొందించిన జీఎ్‌సటీ చట్టం 2017 జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది.

ఏపీ, తెలంగాణల్లో

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఈ జూన్‌లో తెలంగాణ జీఎ్‌సటీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం పెరిగి రూ.5,653 కోట్లకు చేరగా.. ఆంధ్రప్రదేశ్‌లో వసూళ్లు అతి స్వల్పంగా పెరిగి రూ.4,027 కోట్లుగా నమోదయ్యాయి.

గత నెల గణాంకాలు (రూ.కోట్లు)

సెంట్రల్‌ జీఎస్‌టీ 34,558

స్టేట్‌ జీఎస్‌టీ 43,268

ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ 93,280

సుంకం ఆదాయం 13,491

మొత్తం 1,84,597

ఇవీ చదవండి:

మీ వ్యక్తిగత రుణాన్ని ఈ 5 మార్గాలతో ఈజీగా తీర్చుకోండి

వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. డేంజర్ జాగ్రత్త..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 06:32 AM