ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

LIC Share Sale: ఎల్‌ఐసీలో 1 శాతం వాటా విక్రయం

ABN, Publish Date - Jul 11 , 2025 | 03:08 AM

ప్రభుత్వ రంగంలోని బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మరోసారి వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈక్విటీలో 1 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా...

  • ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌

  • మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా అమ్మకం

  • రూ.5,850 కోట్ల వరకు సమీకరణ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మరోసారి వాటాల విక్రయానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈక్విటీలో 1 శాతం వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ ఓఎ్‌ఫఎస్‌ ద్వారా రూ.5,850 కోట్ల వరకు సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ఈ వాటా విక్రయంపై పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.

ఎందుకంటే ?

ఎల్‌ఐసీ 2022 మే నెలలో తన ఈక్విటీలో 3.5 శాతం వాటాను ఐపీఓ ద్వారా విక్రయించి రూ.21,000 కోట్లు సమీకరించింది. సెబీ నిబంధనల ప్రకారం కంపెనీ 2027 మే నాటికి తన ఈక్విటీలో కనీసం 10 శాతం అంటే మరో 6.5 శాతం వాటాను ప్రజలకు విక్రయించాలి. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా.. మార్కెట్‌ పరిస్థితులను బట్టి దశల వారీగా విక్రయించాలని ఎల్‌ఐసీ యోచిస్తోంది. ఆ వ్యూహంలో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 శాతం ఈక్విటీ వాటా ను త్వరలో ఓఎ్‌ఫఎస్‌ ద్వారా విక్రయించాలని భావిస్తున్నట్టు సమాచారం.

ఇన్వెస్టర్లకు నిరాశే

2022 మే నెలలో రూ.21,000 కోట్ల సమీకరణకు ఎల్‌ఐసీ రూ.902-949 ధరల శ్రేణితో ఐపీఓకు వచ్చింది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో ఇష్యూ దాదాపు మూడు రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది. అయితే షేర్ల లిస్టింగ్‌ తొలి రోజే 8 శాతం నష్టంతో మదుపరులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఒక్కో షేరును రూ.949 చొప్పున జారీ చేయగా 2023 మే నెలలో ఒకదశలో ఎల్‌ఐసీ షేరు రూ.567కు పడిపోయింది. గత 52 వారాల్లో ఒక దశలో రూ.1,221.5కి చేరినా మళ్లీ వెంటనే నష్టాల బాట పట్టింది. గురువారం కూడా బీఎ్‌సఈలో ఎల్‌ఐసీ షేరు 2.01 శాతం నష్టంతో రూ.926.85 వద్ద ముగిసింది. ఇది ఐపీఓ ధరతో పోల్చితే రూ.22.15 తక్కువ. ఈ నేపథ్యంలో కంపెనీ జారీ చేసే ఓఎ్‌ఫఎ్‌సకు మదుపరులు నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందన్నది పెద్ద ప్రశ్న.

ఇవి కూడా చదవండి

ఇన్‎కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 11 , 2025 | 03:08 AM