హెల్త్‌కేర్ రంగం కోసం నియంత్రణ మండలి
ABN, Publish Date - Jul 04 , 2025 | 05:28 AM
ప్రైవేట్ ఆస్పత్రుల దందాలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మార్కెట్ నియంత్రణ మండలి సెబీ, బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐ, టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తరహాలో...
ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నాలు.. హాస్పిటల్స్ దందాలకు చెక్ పెట్టేందుకే..
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్పత్రుల దందాలకు చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం మార్కెట్ నియంత్రణ మండలి సెబీ, బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి ఐఆర్‌డీఏఐ, టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ తరహాలోనే హెల్త్‌కేర్ రంగం కోసం స్వతంత్రంగా పనిచేసే ఒక రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేసేందుకు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (జీఐసీ), ఐఆర్‌డీఏఐ.. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ రామస్వామి నారాయణన్ వెల్లడించారు. ఈ రెగ్యులేటరీ సంస్థ అమల్లోకి వస్తే ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్య బీమా ఉన్న పేషెంట్ల నుంచి వసూలు చేసే విచక్షణాపూరిత భారీ బిల్లులకు చెక్ పడుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎందుకంటే?
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా అనారోగ్య సమస్యతో హాస్పిటల్‌కు వెళితే, ఆస్పత్రి ఉద్యోగులు అడిగే మొదటి ప్రశ్న ‘మీకు ఆరోగ్య బీమా పాలసీ ఉందా? అని.. ఉంది అంటే ఇక వారి పంట పండినట్టే. సమస్య చిన్నదైనా వారి నుంచి నగదు చెల్లింపు రోగి కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ బిల్లు చేసి పంపిస్తున్నారని రామస్వామి అన్నారు. అన్ని ఆస్పత్రులు కాకపోయినా, ఎక్కువ ఆస్పత్రుల్లో జరుగుతున్న దందా ఇదే. ఈ క్లెయిమ్‌లు చెల్లించలేక బీమా కంపెనీలు కిందా మీద పడుతున్నాయి. దీంతో ఆ భారాన్ని తట్టుకునేందుకు ప్రీమియం రేట్లు పెంచేసి, ఆ మొత్తాన్ని పాలసీదారుడి నుంచే బీమా కంపెనీలు వసూలు చేస్తున్నాయి. ఇది అటు బీమా కంపెనీలకు, ఇటు పాలసీదారులకు ఇద్దరికీ భారంగానే మారుతోంది. స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే హెల్త్‌కేర్ రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఈ దందాను అడ్డుకోవాలని బీమా సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్‌పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 04 , 2025 | 05:28 AM