Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ABN, Publish Date - May 30 , 2025 | 07:04 AM
అమెరికా ఆర్థిక వ్యవస్థపై మదుపర్ల నమ్మకం పెరగడంతో డాలర్‌కు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఈ పరిణామాలు దేశీ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి.
దేశంలో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం భారత్‌లో 24 క్యారెట్‌ల 10గ్రాముల బంగారం ధర రూ.10 మేర స్వల్పంగా తగ్గి రూ.97,180కు చేరుకుంది. ఇక 22 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,090గా ఉంది. ఇక 18 క్యారెట్‌ల బంగారం ధర రూ.72,890గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.99,800గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 29,630గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే, 18కే) ఇలా
చెన్నై: ₹97,030; ₹88,940; ₹73,240
ముంబై: ₹97,030; ₹88,940; ₹72,770
ఢిల్లీ: ₹97,180; ₹89,090; ₹72,890
కోల్‌కతా: ₹97,030; ₹88,940; ₹72,770
బెంగళూరు: ₹97,030; ₹88,940; ₹72,770
హైదరాబాద్: ₹97,030; ₹88,940; ₹72,770
కేరళ: ₹97,030; ₹88,940; ₹72,770
పుణే: ₹97,030; ₹88,940; ₹72,770
వడోదరా: ₹97,080; ₹88,990; ₹72,810
అహ్మదాబాద్: ₹97,080; ₹88,990; ₹72,810
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. డాలర్ బలపడుతోందన్న సంకేతాలు, లాభాల స్వీకరణ వంటి పరిణామాలతో గత కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ఫెడరల్ రిజర్వ్ ఇటీవలే ప్రకటించింది. ఇక ట్రంప్ ప్రతీకార సుంకాలపై అమెరికా కోర్టు బ్రేకులు వేయడం కూడా బంగారం ధరల పతనానికి కారణమయ్యింది. ట్రంప్ ప్రభుత్వం తన పరిధి దాటిందని కూడా కోర్టు అభిప్రాయపడింది. అయితే, కోర్టు తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం అప్పీలు చేసుకోనుందని సమాచారం.
అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లల్లో కోత ఉంటుందన్న ఆశ సన్నగిల్లడం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు స్వల్పంగా వంటివి బంగారానికి డిమాండ్ తగ్గేలా చేశాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ రూ.778 మేర తగ్గాయి.
ఇవీ చదవండి:
భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్‌ను ఓవర్ టేక్ చేసిన వైనం
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 30 , 2025 | 07:19 AM