ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Price Dubai Vs India: భారత్‌తో పోలిస్తే దుబాయ్‌ బంగారం ధర ఎందుకు తక్కువంటే..

ABN, Publish Date - Mar 10 , 2025 | 02:16 PM

భారత్‌ కంటే దుబాయ్‌లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. ఇలా ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం

ఇంటర్నెట్ డెస్క్: బంగారం అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావు అరెస్టయ్యాక దుబాయ్‌పై చర్చ మొదలైంది. దుబాయ్‌లో బంగారం ధరలు తక్కువగా ఉంటాయా? దీనికి కారణమేంటీ అనే చర్చ జరుగుతోంది. మరి అసలు దుబాయ్‌ బంగారం కథ ఏంటో వివరంగా తెలుసుకుందామా?

దుబాయ్‌లో బంగారం ధర భారత్‌లో పోలిస్తే చాలా తక్కువ. బంగారం వాణిజ్యానికి దుబాయ్ ఎప్పటి నుంచో కేంద్రంగా ఉంటోంది. భారత్‌ కంటే తక్కువకే అక్కడ బంగారం దొరకుతుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

బంగారం కొనుగోళ్లపై దుబాయ్ ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించదు. దీంతో, అక్కడ మార్కట్ ధరలకే వినియోగదారులు బంగారాన్ని కొనుక్కోవచ్చు (Gold Prices India Vs Dubai).


Indian Talking Loudly At Airport: అస్సలు మర్యాద లేదు.. సాటి భారతీయుడిని తిట్టిపోసిన ఎన్నారై!

ఇక భారత్‌కు భిన్నంగా దుబాయ్ ప్రభుత్వం బంగారం దిగుమతులపై కూడా ఎలాంటి సుంకాలు విధించదు. దీంతో, పసిడి ధరలు మరింత తగ్గుతాయి. దీనికి తోడు అక్కడి మార్కెట్లో పోటీ కారణంగా వ్యాపారులు వినియోగదారులకు తక్కువ ధరకే బంగారం విక్రయిస్తుంటారు. చరిత్రలో కూడా దుబాయ్‌కు బంగారం వాణిజ్యంలో కీలక స్థానం ఉంది.

భారత్‌లో బంగారంపై పన్నులు.. సుంకాలు..

అసలే భారతీయులకు బంగారంపై మమకారం ఎక్కువ. ఫలితంగా పసిడిపై కొనుగోళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం బంగారంపై సుంకాలు, పన్నులు విధిస్తోంది. గతేడాది బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. స్మగ్లింగ్‌కు అడ్డకట్ట వేసి చట్టబద్ధమైన దిగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సుంకాల్లో కోత పడ్డప్పటికీ ఎంత దిగుమతి చేసుకోవచ్చనే విషయంలో కొన్ని పరిమితులు అమల్లో ఉన్నాయి. దీన్ని దాటితే అదనపు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. దీనికి తోడు భారతీయ పర్యాటకులు విదేశాల నుంచి కొని తెచ్చుకునే బంగారు నగలపై కూడా పరిమితులు ఉన్నాయి.


God equation theory: దేవుడి ఉనికికి గణిత ఫార్ములాతో ప్రూఫ్.. హార్వర్డ్ శాస్త్రవేత్త స్టేట్‌మెంట్

పురుష ప్రయాణికులు ఒక్కొక్కరు గరిష్ఠంగా 20 గ్రాములు లేదా రూ.50 వేల విలువైన బంగారాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండానే భారత్‌కు తీసుకురావచ్చు. మహిళల విషయంలో ప్రభుత్వం ఈ పరిమితిని 40 గ్రాములు లేదా రూ.లక్ష విలువైన బంగారంగా నిర్ణయించింది.

ఈ పరిమితి దాటితే అదనంగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎంతనేది అదనంగా తెచ్చుకున్న బంగారంపై ఆధారపడి ఉంటుంది. అయితే, కస్టమ్స్ సుంకాల తగ్గింపు తరువాత భారత్‌లో బంగారం దిగుమతులు పెరిగాయి. ఏకంగా 10.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు పెరిగి అప్పట్లో 29.65 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

Read Latest and Viral News

Updated Date - Mar 10 , 2025 | 02:52 PM