Share News

Indian Talking Loudly At Airport: అస్సలు మర్యాద లేదు.. సాటి భారతీయుడిని తిట్టిపోసిన ఎన్నారై!

ABN , Publish Date - Mar 10 , 2025 | 08:40 AM

అబుదాబీ ఎయిర్‌పోర్టులో ఓ భారతీయుడు చుట్టుపక్కల వారికి చికాకు కలిగించే పెద్ద గొంతుతో ఫోనులో మాట్లాడంపై మరో ఎన్నారై విచారం వ్యక్తం చేశారు. పౌర స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ నెట్టింట వీడియో పంచుకున్నాడు.

Indian Talking Loudly At Airport: అస్సలు మర్యాద లేదు.. సాటి భారతీయుడిని తిట్టిపోసిన ఎన్నారై!

ఇంటర్నెట్ డెస్క్: బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు కాస్త పౌర స్పృహతో ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా మలుచుకోవడం తెలిసుండాలి. లేకపోతే, అభాసుపాలు కావాల్సి వస్తుంది. జనాల తిట్లకు బలి కావాల్సి వస్తుంది. తాజాగా ఓ భారతీయుడి విషయంలో ఇదే జరిగింది. అతడి తీరుకు విసిగిపోయిన మరో ఎన్నారై ఏకంగా వీడియో తీసి మరీ ఏకిపారేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అంకుశ్ అనే ఎన్నారై తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. అబు ధాబీ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఓ భారతీయ వ్యక్తి పెద్ద గొంతుతో ఫోనులో మాట్లాడుతూ అక్కడున్న వారికి ఇబ్బంది కలగజేశాడని చెప్పుకొచ్చాడు (Indian Talking Loudly At Airport). చిన్న మాట్లాడాలని అక్కడి సిబ్బంది ఓసారి వచ్చి చెప్పి వెళ్లినా కూడా అతడి తీరు మారలేదని అన్నారు. అతడిలో కనీస పౌర స్పృహ కనిపించలేదని అన్నారు. భారతీయుల్లో చాలా మంది ఇలాగే చికాకు కలిగిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల వారు ఇలా నడుచుకోరని అన్నాడు.


God equation theory: దేవుడి ఉనికికి గణిత ఫార్ములాతో ప్రూఫ్.. హార్వర్డ్ శాస్త్రవేత్త స్టేట్‌మెంట్

‘‘పబ్లిక్ ప్లేసుల్లో చుట్టూ ఉన్న వారి గురించి పట్టించుకోకుండా పెద్ద గొంతుతో ఫోన్లల్లో మాట్లాడే వారి గురించి ఏమనుకోవాలి. వాస్తవం చెప్పుకోవాలంటే నేనూ గతంలో ఇలా ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. కానీ మనం ఎందుకు ఇలా చేస్తాం. ఈ లాంజ్‌లో ఉన్న వ్యక్తి బిగ్గరగా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి’ అని వీడియో పోస్టు చేశారు.

ఈ వీడియోకు సహజంగానే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వేల కొద్దీ లైక్స్, లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అనేక మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘నువ్వు అన్నది కరెక్టే.. జనాలు ఇలా ఎందుకు పక్క వారిని ఇబ్బంది పెడతారో. ఇతనికి అస్సలు పౌర స్పృహ లేదు. ఇతడి తల్లిదండ్రులు ఏమీ నేర్పించలేదా? పిల్లలకు పద్ధతిగా ఎలా నడుచుకోవాలో నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యతే’’ అని ఓ వ్యక్తి అన్నారు.


Boss angry rants: ఆఫీసులో మీ భార్యకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ కోర్చోవద్దు.. నెటిజన్ పోస్టు వైరల్

‘‘క్రమశిక్షణ, హుందాతనం, పౌరస్పృహ సహజంగా పుట్టుకతో వచ్చే లక్షణాలు కావు. అవి నేర్చుకుంటేనే వచ్చే అలవాట్లు. కొందరు అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తుంటారు. ఏం కాదులే అన్న ఆలోచనే వారితో ఇలా చేయిస్తుంది. ఇలాంటి వారి వల్ల భారతీయులు అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కానీ వారికి ఇలాంటి వాటిని పట్టించుకునే స్థితిలో ఉండరు’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ‘‘ఇది కేవలం పౌరస్పృహకు సంబంధించిన అంశమే కాదు. అవతలి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానానికి సంబంధించినది. ఇలాంటి విషయాల్లో విదేశస్థులు మరింత జాగరూకతతో ఉంటారు. అయినా అధిక శాతం భారతీయులు ఇలా అమర్యాదగా వ్యవహరిస్తారనడం సబబు కాదు. కొందరిలో కనీస జ్ఞానం కరువవుతుంది’’ అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Mar 10 , 2025 | 08:59 AM