Boss angry rants: ఆఫీసులో మీ భార్యకు ఇటువంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ కోర్చోవద్దు.. నెటిజన్ పోస్టు వైరల్
ABN , Publish Date - Mar 09 , 2025 | 09:19 AM
బాస్ తిట్లకు ఓ ఉద్యోగిని తీవ్ర ఆవేదనతో రోదించడం చూసి తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి భారతీయ పని సంస్కృతిని తిట్టిపోస్తూ నెట్టింట పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు నుంచి పెద్ద ఎత్తున స్పందన

ఇంటర్నెట్ డెస్క్: ఆఫీసు అన్నాక ఒత్తిడులు సహజం. టార్గెట్లు, డెడ్‌లైన్లు ఇలాంటి సవాలక్ష తలనొప్పులు ఉంటాయి. అయితే, కొందరు బాస్‌లు మాత్రం కింది స్థాయి ఉద్యోగులను రాచి రంపాన పడెతుంటారు. వీడియో కాల్ సందర్భంగా ఓ ఉద్యోగినికి బాస్ ఇలాగే నరకం చూపించడంతో ఆమె కన్నీరు మున్నీరైంది. ఇంట్లోనే ఉన్న ఉద్యోగిని భర్త ఇది చూసి తట్టుకోలేక తన ఆవేదనను నెట్టింట పంచుకున్నారు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Wifes Toxic Boss Makes her Cry).
‘‘మధ్యాహ్నం నుంచి నా భార్య రోదిస్తూనే ఉంది. మీటింగ్ సందర్భంగా ఆమె బాస్ తనతో చాలా దురుసుగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా కన్నీరు ఆగట్లేదు. ఇంత అవమానకరంగా వ్యవహరించే వాళ్ల తప్పు చేస్తున్నామన్న భయం ఉండదా? అసలు మనం ఎలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాము. ఇలాంటి దురుసుగా మాట్లాడితే ఏంకాదు.. ఉద్యోగులు భరిస్తారన్న ఆలోచన వీళ్లకు ఎందుకు వస్తుంది? వాళ్ల చికాకులు మన మీద ప్రదర్శించే హక్కు వీళ్లకు ఎరవిచ్చారు’’ అని ప్రశ్నించారు. భారతీయ మేనేజర్లు అంతా ఇలాగే ఉంటారంటూ మండిపోయారు. అమెరికా వెళ్లినా వీళ్లల్లో మార్పు రాదని అన్నారు.
Burhanpur Gold Hunt: ఛావా సినిమాతో పూనకం.. బంగారు నాణేలు తవ్వి తీసేందుకు ఎగబడ్డ గ్రామస్థులు
‘‘అమెరికాలో ఉంటున్న నా బంధువును కూడా అక్కడి భారతీయ బాస్ ఇలాగే టార్చర్ పెడుతున్నారు. మన డీఎన్‌ఏలోనే ఏదైనా తప్పు ఉందా? అవతలి వారిని రాచి రంపాన పెట్టడం మన సహజ లక్షణమా?’’ అని అన్నారు.
రెడిట్‌లో పంచుకున్న ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ‘‘భారత్‌లో చాలా మంది ఇలాగే ఉంటారు. ఇలా ఉన్నందుకు వారికి మరిన్ని ప్రశంసలు దక్కుతాయి. భారత్ కార్పొరేట్ ప్రపంచంలో కింది స్థాయి ఉద్యోగుల బాగోగులు ఎవరికీ పట్టదు. వాళ్ల పోతే మరొకరు వస్తారు. అంతకంటే తక్కువ జీతానికే పనిచేస్తారు’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.
Cop Slaps Boy: ప్రధాని కాన్వాయ్ రిహార్సల్స్.. అడ్డొచ్చిన టీనేజర్ చెంప ఛెళ్లు మనిపించిన ఎస్సై
‘‘మీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటే భార్యను జాబ్ మానేయమని చెప్పండి. ఆత్మ గౌరవానికి మించినది ఏదీ లేదు. ఒక్కసారి ఆత్మవిశ్వాసం కోల్పోతే మళ్లీ తిరిగి పొందడం చాలా కష్టం. కాన్ఫిడెన్స్ తగ్గే కొద్దీ ఆఫీసులో మీ పనితీరు కూడా మందగిస్తుంది. కొత్త జాబ్ వెతుక్కోవడం కూడా కష్టంగా మారుతుంది. కాబట్టి, వెంటనే జాబ్ మానేయమని చెప్పండి లేదా కొత్త జాబ్ చూసుకోమనండి.. చూస్తూ మాత్రం ఊరుకోవద్దు’’ అని మరో వ్యక్తి సలహా ఇచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.