Gold Record Price: బంగారం దూకుడు
ABN, Publish Date - Aug 08 , 2025 | 05:55 AM
పసిడి ధర మరోసారి రికార్డు సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం గురువారం రూ.3,600 పెరిగి సరికొత్త రికార్డు స్థాయి రూ.1,02,620కి చేరింది. కిలో వెండి ధరా రూ.1,500 లాభంతో...
ఢిల్లీ మార్కెట్లో ఒక్కరోజే రూ.3,600 అప్
10 గ్రాముల ధర రూ.1,02,620
ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరిక
న్యూఢిల్లీ: పసిడి ధర మరోసారి రికార్డు సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి (24 కేరట్స్) బంగారం గురువారం రూ.3,600 పెరిగి సరికొత్త రికార్డు స్థాయి రూ.1,02,620కి చేరింది. కిలో వెండి ధరా రూ.1,500 లాభంతో రూ.1.14 లక్షలకు చేరింది. మరోవైపు ప్యూచర్స్ మార్కెట్లోనూ పసిడి ధర రికార్డు సృష్టించింది. అక్టోబరులో డెలివరీ ఇచ్చే 10 గ్రాములు మేలిమి బంగారం ధర ఎంసీఎక్స్‌లో గురువారం రూ.893 లాభంతో రూ.1,02,155 స్థాయికి దూసుకుపోయింది. హైదరాబాద్‌లోనూ పసిడి ధర రూ.320 లాభంతో రూ.1,02,550కు చేరింది. కిలో వెండి ధర మాత్రం రూ.1,000 పెరిగి రూ.1.27లక్షల వద్ద ముగిసింది. ట్రంప్ సుంకాల భయంతో చాలా మంది మదుపరులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి కొనుగోళ్లకు దిగడం, డాలర్‌తో పడిపోతున్న రూపాయి మారకం రేటూ ఇందుకు దోహదం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 08 , 2025 | 05:55 AM