GIG: గోద్రెజ్ ఇండస్ట్రీస్, బీఎంసీ, భామ్లా ఫౌండేషన్... ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా పోరాటం
ABN, Publish Date - Jun 05 , 2025 | 10:35 PM
గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG), బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC), భామ్లా ఫౌండేషన్, UNEP మద్దతుతో BeatPlasticPollution ప్రచారాన్ని ప్రారంభించాయి.
ముంబై: గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG), బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC), భామ్లా ఫౌండేషన్, UNEP మద్దతుతో #BeatPlasticPollution ప్రచారాన్ని ప్రారంభించాయి. ప్లాస్టిక్ కాలుష్యంపై అవగాహన పెంచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఇప్పటికే 64% పునరుత్పాదక ఇంధనాన్ని ఉపయోగిస్తోందని, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ను 20% తగ్గించి, 100% సేకరించి రీసైకిల్ చేస్తోందని తెలిపారు. 63,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాన్ని ల్యాండ్‌ఫిల్స్‌కు వెళ్లకుండా ఆపగలిగామని పేర్కొన్నారు. భారతదేశంలో ఏటా 9.46 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
అందులో 43% సింగిల్-యూజ్ ప్లాస్టిక్. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు, ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత జీవనశైలిని అవలంబించేలా ప్రోత్సహిస్తారు. ఇందులో భాగంగా, ముంబైలోని బాంద్రాలో గోద్రెజ్ మాజిక్ రెడీ-టు-మిక్స్ హ్యాండ్ వాష్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ బాటిళ్లను రీఫిల్ చేసుకోవడం ద్వారా ఎంత ప్లాస్టిక్ ఆదా అవుతుందో రియల్-టైమ్‌లో ప్రదర్శిస్తారు. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (GCPL) పర్సనల్ కేర్ విభాగం మార్కెటింగ్ హెడ్ నీరజ్ సెంగుట్టువన్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కి వ్యతిరేకంగా అందరూ ఏకతాటిపై నిలవాలన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 10:35 PM