ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Business Idea: తక్కువ పెట్టుబడితో.. రోజుకు రూ.10 వేలు లాభం

ABN, Publish Date - Jan 23 , 2025 | 04:29 PM

Business Idea: రోజులు మారిపోయాయి. ఉద్యోగాలు కన్నా.. స్వయం ఉపాధిపైనే యువత అధికంగా ఆసక్తి చూపుతోంది. అలాంటి వేళ స్వయం ఉపాధి ప్రారంభించే వారికి.. ప్రభుత్వ తోడ్పాటును సైతం అందిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలా లేవు. ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నా.. వాటికి ఎక్కడ చూసినా.. విపరీతమైన పోటీ ఉంది.. ఉంటోంది. దీంతో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించుకొందామా? అంటే.. వాటిని ప్రారంభిస్తే.. నష్టాలు వస్తాయేమో అనే మీమాసం... పలువురిని టెన్షన్ పెడుతోంది. అలాంటి వేళ.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే వ్యాపారాలు కొన్ని ఉన్నాయి. అంతేకాదు.. ఓ వేళ మీరు వ్యాపారం ప్రారంభిస్తే.. ప్రభుత్వం సైతం మీకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తుంది. అదే గొర్రెల పెంపకం వ్యాపారం. ప్రస్తుత వేళ.. ఈ వ్యాపారం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రెండవ స్థానంలో ఉంది. అంతేకాదు.. అతి పెద్ద వ్యాపారంగా కూడా ఎదిగింది. దీనిలో ఓ ప్రత్యేకత సంతరించుకొంది. ఇందులో నష్టం చాలా తక్కువగా ఉంటుంది. గొర్రెల మాంసం, పాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ వ్యాపారంలోని లాభాలు అధికంగా ఉంటాయి. నష్టాలు చాలా స్వల్పంగా ఉంటాయని ఈ వ్యాపారం చేసిన వారు చెబుతారు.


గొర్రెల మాంసంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే గొర్రె పాలలో అధిక ఔషధ గుణాలు ఉంటాయి.ఇక గొర్రెల కాళ్ల నుంచి ఎన్నో రకాల ఉత్పత్తులు తయారవుతాయి. దీంతో గొర్రెల వ్యాపారంతో భారీగా నగదు సంపాదించవచ్చు. కానీ ఈ గొర్రెల వ్యాపారం ప్రారంభించాలంటే.. సరైన అవగాహన ఉండాలి. లేకుంటే నష్టాల పాలయ్యే అవకాశాలే ఎక్కువ.


గొర్రెల పెంపకంలో కొన్ని మెళకువలు: వీటి పెంపకంలో కొన్ని మెళకువలు పాటించాల్సి ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పాటిస్తే.. మంచి ఆదాయం సమకూరుకోవచ్చు. ఓ వేళ గొర్రెలను పెంచుతోంటే.. వాటిని తరచు శుభ్రం చేయాలి. వాటికి ఫెనైల్ లేదా డిజిన్ఫెక్టెంట్ స్ప్రే చేయడం ద్వారా గొర్రెలను సంక్రమణాల నుంచి రక్షించవచ్చు. శుభ్రతే.. గొర్రెలకు వ్యాధుల నుంచి కాపాడుతోంది. ఇక గొర్రెలను చలికాలంలో చాలా ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంది.


చల్లని వాతావరణంలో గొర్రెలను వేడిగా ఉంచేందుకు... నేలపై పసుపు చల్లి.. నీటి నుంచి వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి గోడలకు రంగ వేయాల్సి ఉంటుంది. దీని ద్వారా హానికరమన సూక్షజీవాలను తొలగించవచ్చు. దీని ద్వారా గొర్రెలకు వేగంగా వ్యాధులు సంక్రమించవు. ఇక గొర్రెల వయస్సు, బరువు ప్రకారం.. పోషకాహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. చలికాలంలో వాటికి రోగనిరోధక శక్తిని పెంచేందుకు బలవర్ధకమైన ఆహారం అందించాల్సి ఉంటుంది.


ప్రస్తుతం మటన్‌కు భారీగా డిమాండ్ ఉంది. అటువంటి పరిస్థితుల్లో.. ఈ వ్యాపారాన్ని చేపట్టేందుకు అత్యధికులు ఆసక్తి కనబరుస్తున్నారు. గొర్రెల పెంపకంలో మంచి సంరక్షణ, సరైన పోషకాహారం ఇవ్వడం ద్వారా ఇది రైతుల కోసం ఒక స్థిర ఆదాయ వనరుగా మారుతోంది. నిపుణుల సూచనలను పాటించడం ద్వారా గొర్రెల పెంపకం మరింత లాభసాటిగా మారుతోంది. ఈ వ్యాపారం వల్ల స్వల్ప వ్యవధిలో.. అధిక మొత్తంలో నగదు సంపాదించే అవకాశం ఉంది. అదీకాక ఈ గొర్రెల వ్యాపారం ప్రారంభించాలను కొంటే.. బ్యాంకులకు కానీ.. పశు సంవర్ధక శాఖ అధికారులను కానీ సంప్రదిస్తే.. అందుకు సంబంధించిన వివరాలను వారు వివరిస్తారు.

For Business News And Telugu News

Updated Date - Jan 23 , 2025 | 04:36 PM