ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మార్కెట్లపై యుద్ధ భయాలు

ABN, Publish Date - Jun 16 , 2025 | 01:36 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావం చూపించనుంది. ఇప్పటికే క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా...

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం ప్రపంచ వాణిజ్యంపై పెను ప్రభావం చూపించనుంది. ఇప్పటికే క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధం మరింత తీవ్రతరమై ఇతర దేశాలకు పాకితే ప్రపంచ సంక్షోభం రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మదుపరులు ఆచితూచి అడుగులు వేయటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌: అనిశ్చిత పరిస్థితుల్లోనూ డిఫెన్స్‌ స్టాక్స్‌ రాణిస్తున్నాయి. సుదీర్ఘ కన్సాలిడేషన్‌ తర్వాత ఈ షేరు మూడు నెలల్లో 40 శాతం మేర పెరిగింది. ఆ తర్వాత స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగున్నా యి. గత శుక్రవారం రూ.394 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.390 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.440 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.375 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బయోకాన్‌: ప్రస్తుతం ఈ షేరు స్వల్ప, మధ్య కాలిక మూమెంటమ్‌ గణనీయంగా పెరుగుతోంది. పైగా 20,50 రోజుల ఈఎంఏపై స్థాయిలో చలిస్తున్నాయి. గత శుక్రవారం రూ.355 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.340 ఎగువన ప్రవేశించి రూ.410 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.320 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

టెక్‌ మహీంద్రా: ప్రస్తుతం ఈ షేరు కీలక నిరోధ స్థాయి రూ1,700కి సమీపంలో ఉంది. ఏప్రిల్‌ నుంచి రిలేటివ్‌ స్ట్రెంత్‌, మూమెంటమ్‌ క్రమంగా పెరుగుతున్నాయి. చివరి మూడు నెలల్లో 15 శాతం మేర పెరిగింది. ఫండమెంటల్స్‌ బలంగా ఉన్నాయి. గత శుక్రవారం రూ.1,659 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,630/1,650 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.1,740/1,770 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,610 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

విప్రో: ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ కౌంటర్‌లో ప్రస్తుతం అక్యుములేషన్‌ జరుగుతోంది. ప్రైస్‌ యాక్షన్‌ చాలా టైట్‌గా కొనసాగుతోంది. రిలేటివ్‌ స్ట్రెంత్‌, మూమెంటమ్‌ పెరుగుతున్నాయి. గత శుక్రవారం రూ.260 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.250 శ్రేణిలో ఎంటరై రూ.390/410 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.240 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మ్యాక్స్‌హెల్త్‌: ఈ కౌంటర్‌కు అనేక అనుకూలతలు కనిపిస్తున్నాయి. తాజాగా 52 వారాలు, జీవితకాల గరిష్ఠాన్ని బ్రేక్‌ చేసింది. జనవరి నుంచి కన్సాలిడేషన్‌ దిశలో కొనసాగుతోంది. పైగా మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ మెరుగ్గా ఉన్నాయి. గత శుక్రవారం రూ.1,232 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,220 ఎగువన పొజిషన్‌ తీసుకుని రూ.1,450 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,200 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 01:36 AM