Stock Split History: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోనస్ బొనాంజా
ABN, Publish Date - Jul 20 , 2025 | 03:57 AM
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే, బ్యాంక్ వాటాదారులు కలిగి ఉన్న ప్రతి ఒక్క షేరుకు గాను ఒక షేరు బోన్‌సగా...
జూఒక్కో షేరుకు ఉచితంగా ఒక షేరు జారీ
జూబ్యాంక్ చరిత్రలో తొలి బోనస్ షేర్ల ఇష్యూ
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే, బ్యాంక్ వాటాదారులు కలిగి ఉన్న ప్రతి ఒక్క షేరుకు గాను ఒక షేరు బోన్‌సగా లభించనుంది. ఇందుకు అర్హులైన షేర్‌హోల్డర్ల వివరాలను ఆగస్టు 27న రికార్డు చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ చరిత్రలో ఇదే తొలి బోనస్ షేర్ల జారీ. దీంతో బ్యాంక్‌లో రూ.2 లక్షల లోపు ఈక్విటీ వాటా కలిగిన 36 లక్షలకు పైగా చిన్న మదుపరులకు లబ్ధి చేకూరనుంది. వీరు బ్యాంక్‌లో మొత్తం 10.32 శాతం వాటా కలిగి ఉన్నారు. కాగా, బ్యాంక్ 2011లో రూ.10 ముఖ విలువ కలిగిన షేరును రూ.2 ముఖ విలువతో కూడిన 5 షేర్లుగా విభజించింది. ఆ తర్వాత 2019లో రూ.2 ముఖ విలువ కలిగిన షేరును రూ.1 ముఖ విలువతో కూడిన 2 షేర్లుగా విభజించింది.
ఒక్కో షేరుకు రూ.5 మధ్యంతర డివిడెండ్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.5 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇందుకు అర్హులైన వాటాదారులను ఎంపిక చేసేందుకు ఈ నెల 25ను రికార్డు తేదీగా నిర్ణయించింది. వచ్చే నెల 11న డివిడెండ్ చెల్లింపులు చేపట్టనున్నట్లు బ్యాంక్ తెలిపింది.
క్యూ1లో రూ.16,258 కోట్ల లాభం: జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 1.31 శాతం తగ్గి రూ.16,258 కోట్లకు పరిమితమైంది. స్టాండ్‌ఎలోన్ లాభం మాత్రం రూ.18,155 కోట్లుగా నమోదైంది. క్యూ1లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.99,200 కోట్లకు ఎగబాకగా.. మొత్తం వ్యయాలూ రూ.63,467 కోట్లకు పెరిగాయి. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 5.4 శాతం వృద్ధితో రూ.31,440 కోట్లకు పెరిగినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) మాత్రం 3.35 శాతానికి తగ్గింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 20 , 2025 | 03:57 AM