UPI Payments: యూపీఐ చెల్లింపులు రూ.3 వేలు దాటితే ఛార్జీలు.. అబద్ధం అంటున్న ఆర్థిక శాఖ
ABN, Publish Date - Jun 11 , 2025 | 09:05 PM
మనదేశంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు చాలా మంది యూపీఐల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. డబ్బులు తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా మొబైల్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు.
మనదేశంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న బడ్డీ దుకాణాల వరకు చాలా మంది యూపీఐల (UPI Payments) ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. డబ్బులు తీసుకెళ్లే ఇబ్బంది లేకుండా మొబైల్ ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. ఇప్పటివరకు యూపీఐ మీద ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు. అయితే త్వరలోనే ఈ లావాదేవీలపై కూడా ఛార్జ్‌లను వసూలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను తాజాగా ఆర్థిక శాఖ ఖండించింది. (Charges On UPI Payments).
డిజిటల్ లావాదేవీలను నిర్వహించడం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వీరికి సహకరించేందుకు మర్చెంట్ డిస్కౌంట్ రేట్‌లను (MDR Charges) వసూలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు కేవలం ఊహాజనితాలని, ఛార్జీలు వసూలు చేసే ఆలోచన లేదని ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఐ ద్వారా 3000 రూపాయల పైచిలుకు చెల్లింపులు జరిగితే ఎండీఆర్ ఛార్జీలను వసూలు చేస్తారని జాతీయ మీడియా పేర్కొంది. నిజానికి 2020 నుంచి జీరో ఎండీఆర్ పాలసీ అమల్లో ఉంది.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ వసూలు చేయాలనే ఉద్దేశం గానీ, ఆ ఆలోచనగానీ లేవని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఆ వార్తలు పూర్తిగా ఊహాజనితమని కొట్టిపారేసింది. నిరాధార, సంచలనం సృష్టించే వార్తలతో సామాన్య పౌరుల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించడం సరికాదని పేర్కొంది. యూపీఐ ద్వారా చెల్లింపులను ప్రోత్సహించడానికే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళనలూ అవసరం లేదని భరోసా ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 11 , 2025 | 09:05 PM