Equity Market: సానుకూల సంకేతాలతో మార్కెట్ దూకుడు
ABN, Publish Date - Jul 24 , 2025 | 04:21 AM
అమెరికా, జపాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పం దం వార్తలతో ఆసియా మార్కె ట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నడుమ బుధవారం మన ఈక్విటీ మార్కెట్ దూకుడు ప్రదర్శించింది.
540 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: అమెరికా, జపాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పం దం వార్తలతో ఆసియా మార్కె ట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నడుమ బుధవారం మన ఈక్విటీ మార్కెట్ దూకుడు ప్రదర్శించింది. బ్యాంకింగ్, ఆయిల్ రంగాల షేర్లలో విలువ ఆధారిత కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 539.83 పాయింట్లు లాభపడి 82,726.64 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 599.62 పాయింట్ల లాభంతో 82,786.43ని తాకింది. నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,219.90 వద్ద క్లోజయింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకినా చివరికి 1 శాతం లాభంతో ముగిశాయి.
లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 29న ప్రారంభమై 31న ముగుస్తుంది. షేరు ధర శ్రేణిని రూ.150-158గా కంపెనీ ప్రకటించింది.
ఎస్‌బీఐ క్యూఐపీ సూపర్ హిట్
ముంబై: ఎస్‌బీఐ జారీ చేసిన క్యూఐపీ సూపర్ డూపర్ హిట్టయింది. ఇష్యూ ప్రారంభమైన తొలి రోజే నాలుగింతలకుపైగా సబ్‌స్ర్కెబ్ అయింది. ఈ క్యూఐపీ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఎస్‌బీఐ భావించగా, ఇష్యూ ప్రారంభమైన కొద్ది సేపటికే రూ.1.12 లక్షల కోట్లకు బిడ్స్ అందాయి. ఇందులో మూడింట రెండు వంతుల బిడ్స్ విదేశాల నుంచి వచ్చినట్టు ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు. ఎస్‌బీఐ ఆర్థిక పునాదులపై మదుపరులకు ఉన్న నమ్మకానికి ఈ క్యూఐపీ సబ్‌స్ర్కిప్షన్ ఒక ఉదాహరణ అన్నారు. ఎల్‌ఐసీతో సహా అనేక సంస్థలు ఈ ఇష్యూ కోసం బారులు తీరాయి.
Updated Date - Jul 24 , 2025 | 04:21 AM