ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget 2025: ఫిబ్రవరి నెలఖారున పెట్టే బడ్జెటను ఒకటినే ఎందుకు పెడుతున్నారో తెలుసా.. లాజిక్ తెలిస్తే కేంద్రానికి సెల్యూట్ చేస్తారు

ABN, Publish Date - Feb 01 , 2025 | 09:52 AM

Budget 2025: సాధారణంగా బడ్జెట్‌ను ఎక్కువుగా ఫిబ్రవరి 28వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుండేది. మార్చి నుంచి కొత్త ఆర్థిక సంవత్సం ప్రారంభం కావడంతో ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ పెట్టడం సాంపద్రాయంగా మారింది. అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఈ సంప్రదాయంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

Union Budget 2025

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ఈరోజు (శనివారం) పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం (Central Govt) ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో కేంద్రం ఎలాంటి వరాలు కురిపిస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitaraman) దేశ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతుకుముందే కేంద్రమంత్రి వర్గం సమావేశమై ఈ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పన్నుల భారంపై కేంద్రమంత్రి నిర్మల ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనే ఆశాభావంలో ఉన్నారు ప్రజలు.


ఇదిలా ఉండగా... సాధారణంగా బడ్జెట్‌ను ఎక్కువుగా ఫిబ్రవరి 28వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుండేది. మార్చి నుంచి కొత్త ఆర్థిక సంవత్సం ప్రారంభం కావడంతో ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ పెట్టడం సాంపద్రాయంగా మారింది. అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఈ సంప్రదాయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన ప్రధాని అయినప్పటి నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి 28న పెట్టే సాంప్రదాయానికి స్వస్తి పలికారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 28 కంటే ముందుకు జరిపేశారు. అంటే ఫిబ్రవరిలో 1వ తేదీనే బడ్జెట్‌ పెట్టడం జరుగుతోంది. ఇందులో ప్రధాన కారణాలు కూడా లేకపోలేదు.

Union Budget 2025: ఇవాల్టి బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించబోయే వరాలు ఇవేనా


ఫిబ్రవరి చివరి తేదీన బడ్జెట్ పెడితే మంత్రిత్వ శాఖలు, విభాగాల వారీ నిధుల మళ్లింపు ప్రక్రియకు దాదాపు నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. ఈ కారణంగా అధికారులకు పని ఒత్తిడి పెరగడంతో పాటు నిధుల కేటాయింపు, ఖర్చు మధ్య వ్యత్యాసం ఉండటం అనేది ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఏ పనిని ప్రారంభించాలన్న నిధులే ముఖ్యం. నిధుల మళ్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో నిధుల కోసం అధికారులు వేచి చూడాల్సి పరిస్థితి ఏర్పడింది. దీని వలన ప్రతీ పని కూడా ఆలస్యంగా ప్రారంభమయ్యదే. దీనిపై దృష్టి పెట్టిన ప్రధాని బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఆర్థిక సంవత్సం ప్రారంభం నుంచే కొత్త పనులు మొదలవుతాయి. దాంతో పాటు మంత్రిత్వ శాఖల్లో నిధుల కొరత లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతీ సారి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీనే పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.


ఇవి కూడా చదవండి..


Union Budget: బడ్జెట్‌లో ఆ రాష్ట్రాలకు నిధుల వరద.. అసలు సంగతి ఏమిటంటే

గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 12:49 PM