DEC Infrastructure India: డీఈసీ ఇన్‌ఫ్రాకు రూ 613 కోట్ల ఆర్డర్లు
ABN, Publish Date - Jul 28 , 2025 | 01:50 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టులు లభించాయి. ఆర్డర్‌లో భాగంగా...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టులు లభించాయి. ఆర్డర్‌లో భాగంగా ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని భవనాల కన్జర్వేషన్, రెట్రోఫిట్టింగ్‌తో పాటు ఒక సర్వీస్ బిల్డింగ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సీపీడబ్ల్యూడీ నుంచి లభించిన ఈ కాంట్రాక్టు విలువ రూ.317.32 కోట్లు. రెండేళ్లలో ఈ కాంట్రాక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరొక కాంట్రాక్ట్‌లో భాగంగా పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్న నేతాజీ నగర్‌లోని సెంట్రల్ విస్టాలో ఇంటర్నల్ ఫినిషింగ్, ఫర్నీచర్ ఫినిషింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలి. ఈ కాంట్రాక్టు విలువ రూ.295.91 కోట్లు అని కంపెనీ తెలిపింది.
ఇవీ చదవండి:
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..
Updated Date - Jul 28 , 2025 | 01:50 AM