Cyient Profit Decline: 6 శాతం తగ్గిన సైయెంట్ లాభం
ABN, Publish Date - Apr 25 , 2025 | 04:50 AM
సైయెంట్ డిఈటీ 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 6 శాతం లాభం తగ్గి రూ.163 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 సంవత్సరానికి ప్రతి షేరుకు రూ.14 డివిడెండ్ ప్రకటించింది
ఒక్కో షేరుకు రూ.14 డివిడెండ్ హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సైయెంట్ డిఈటీ.. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.1,472 కోట్ల మొత్తం రెవెన్యూపై రూ.163 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే కాలంతో పోల్చితే రెవెన్యూ 3.4 శాతం క్షీణించగా లాభం 6 శాతం తగ్గింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 12.2 శాతం తగ్గుదలతో రూ.605 కోట్లుగా నమోదు కాగా ఆదాయం కూడా 1.6 శాతం క్షీణించి రూ.5,816 కోట్లుగా నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.14 డివిడెండ్ (280 శాతం)ను డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.
Updated Date - Apr 25 , 2025 | 04:51 AM