Foxconn Plant: చైనా టెకీలు తిరిగి వెళ్లినా ఐఫోన్17 ఉత్పత్తిపై ప్రభావం ఉండదు
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:39 AM
భారత్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వందల మంది చైనా టెక్నాలజీ నిపుణులు గడిచిన రెండు నెలల్లో తిరిగి స్వదేశానికి వెళ్లిపోయినప్పటికీ, ఐఫోన్ 17 ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం...
న్యూఢిల్లీ: భారత్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న వందల మంది చైనా టెక్నాలజీ నిపుణులు గడిచిన రెండు నెలల్లో తిరిగి స్వదేశానికి వెళ్లిపోయినప్పటికీ, ఐఫోన్ 17 ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ఈ వ్యవహారంతో సంబంఽ దమున్న వర్గాలు తెలిపాయి. దేశంలో ఐఫోన్ 17 తయారీ షెడ్యూల్ ప్రకారం సాగుతుందన్నారు. మన దేశం నుంచి ఐఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచాలన్న యాపిల్ ప్రణాళికలో నూ ఎలాంటి మార్పు లేదని ఆ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత్ నుంచి 3.5-4 కోట్ల యూనిట్ల ఐఫోన్లు తయారవగా.. ఈసారి ఉత్పత్తిని 6 కోట్ల యూనిట్లకు పెంచాలని యాపిల్ భావిస్తోందన్నారు.
ఇవీ చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 05:43 AM