ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Central Govt: స్టీల్‌ దిగుమతులకు చెక్‌

ABN, Publish Date - Apr 22 , 2025 | 02:43 AM

దేశీయ స్టీల్‌ పరిశ్రమను రక్షించేందుకు కేంద్రం 12 శాతం ప్రత్యేక దిగుమతి సుంకాన్ని విధించింది. చౌకగా దిగుమతి అయ్యే స్టీల్‌పై ఈ సుంకం 200 రోజులు అమల్లో ఉంటుంది

  • 12 శాతం ప్రత్యేక సుంకం విధింపు

న్యూఢిల్లీ: దేశీయ స్టీల్‌ పరిశ్రమ ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక చర్య తీసుకుంది. హెచ్‌ఆర్‌ కాయిల్స్‌, షీట్లు, ప్లేట్లు, సీఆర్‌ కాయిల్స్‌, షీట్లు వంటి ఐదు రకాల స్టీల్‌ దిగుమతులపై వాటి విలువపై 12 శాతం చొప్పున సేఫ్‌గార్డ్‌ డ్యూటీ పేరుతో ప్రత్యేక దిగుమతి సుంకం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఈ స్టీల్‌ ఉత్పత్తుల కనీస దిగుమతి ధరను టన్నుకు 675 డాలర్ల నుంచి 964 డాలర్లుగా నిర్ణయించింది. ఈ ధర కంటే తక్కువ ధరకు దిగుమతి అయ్యే స్టీల్‌ ఉత్పత్తులకు మాత్రమే ఈ 12 శాతం సుంకం వర్తిస్తుంది. ఈ సుంకం 200 రోజుల పాటు అమల్లో ఉంటుంది. చైనాతో సహా వివిధ దేశాల నుంచి చౌక గా వచ్చిపడే దిగుమతులకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది.

Updated Date - Apr 22 , 2025 | 02:44 AM