Cement price Increase 2025: పెరగనున్న సిమెంట్ ధర
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:48 AM
క్రిసిల్ అంచనాలతో, 2025-26 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ధరలు 2% నుంచి 4% పెరిగే అవకాశం ఉందని, గిరాకీ 6.5% నుంచి 7.5% పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 2024-25లో సిమెంట్ పరిశ్రమ నిరాశపరిచిన గిరాకీ కారణంగా ధరలు తగ్గిపోయాయి
4% వరకు పెరిగే అవకాశం: క్రిసిల్
టన్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సిమెంట్ పరిశ్రమకు బాగానే కలిసొస్తుందని క్రిసిల్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ధర 2 నుంచి 4 శాతం, గిరాకీ 6.5 నుంచి 7.5 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. కీలక మౌలిక ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు 10 శాతం పెరగడం, గ్రామీణ గృహ నిర్మాణ రంగం పుంజుకోవడం, ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలు ఇందుకు కలిసి రానున్నాయి.
నిరాశపరిచిన 2024: గత ఆర్థిక సంవత్సరం (2023 -24) సిమెంట్ పరిశ్రమకు పెద్దగా కలిసి రాలేదు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గిరాకీ 4.5 నుంచి 5.5 శాతం మాత్రమే పెరిగింది. లోక్‌సభ ఎన్నికలు, భారీ వర్షాలు ఇందుకు ప్రధాన కారణం. దీంతో గత ఆర్థిక సంవత్సరం ధరలు కూడా పరిశ్రమను బాగా నిరాశ పరిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక దశలో ప్రముఖ కంపెనీల 50 కిలోల సిమెంట్ బస్తా రూ.300కి కూడా పడిపోయింది. ప్రసుతం కోలుకుని రూ.350 నుంచి రూ.360 మధ్య ట్రేడవుతోంది.
Updated Date - Apr 23 , 2025 | 12:49 AM