ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CDSL: ఆర్థిక అక్షరాస్యత పెంపునకు బహుళ భాషా వేదిక.. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ ఐపీవో దిశగా

ABN, Publish Date - Jul 11 , 2025 | 10:36 PM

భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంచేందుకు, పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించేందుకు CDSL ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (CDSL IPF) కీలకమైన అడుగు వేసింది.

ముంబై: భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యతను పెంచేందుకు, పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించేందుకు CDSL ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (CDSL IPF) కీలకమైన అడుగు వేసింది. 12 భారతీయ భాషలలో సమగ్రమైన కంటెంట్‌తో కూడిన కొత్త ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను 2025 జూలై 7న SEBI ఛైర్‌పర్సన్ తుహిన్ కాంత పాండే ప్రారంభించారు. ఇది సెక్యూరిటీస్ మార్కెట్లను సులభతరం చేసి, బాధ్యతాయుతమైన పెట్టుబడి అలవాట్లను ప్రోత్సహిస్తుంది, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని పెట్టుబడిదారులందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ ఐపీవో దిశగా

మరోవైపు, ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ రూ. 6 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ఐపీవో దిశగా అడుగులు వేసింది. ఇందుకోసం తమ డీఆర్‌హెచ్‌పీని రహస్య ప్రాతిపదికన సెబీకి సమర్పించింది. కంపెనీ రూ. 50 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను సోలార్, స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థల (IPP) విభాగంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగించనున్నారు. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీకి ప్రస్తుతం 157 MW నిర్వహణ సామర్థ్యం ఉండగా, అదనంగా 400 MW సామర్థ్యాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

Updated Date - Jul 11 , 2025 | 10:36 PM