ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆచితూచి వ్యవహరించడమే మేలు

ABN, Publish Date - May 26 , 2025 | 05:48 AM

ఈ వారం సైతం దేశీయ స్టాక్‌మార్కెట్‌లో ఆటుపోట్లు తప్పేలా లేవు. సూచీల గమనానికి అంతర్జాతీయ సంకేతాలే కీలకం కానున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మళ్లీ సుంకాల హెచ్చరికలకు దిగడం మార్కెట్‌...

ఈ వారం సైతం దేశీయ స్టాక్‌మార్కెట్‌లో ఆటుపోట్లు తప్పేలా లేవు. సూచీల గమనానికి అంతర్జాతీయ సంకేతాలే కీలకం కానున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మళ్లీ సుంకాల హెచ్చరికలకు దిగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మదుపరులు ఆచితూచి వ్యవహరించడమే మంచిది. గత వారం రియల్టీ, పీఎ్‌సయూ, డిఫెన్స్‌, బ్యాంకింగ్‌ షేర్లు బాగా రాణించాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, టూరిజం, ఐటీ, చము రు కంపెనీల షేర్లు మాత్రం నిరాశపరిచాయి. దీంతో గత వారం నిఫ్టీ సగం నష్టాలను మాత్రమే పూడ్చుకుంది.

స్టాక్‌ రికమండేషన్లు

యాక్సిస్‌ బ్యాంక్‌: గత మూడు నెలల్లో యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 18 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం కన్సాలిడేషన్‌ దశలో ఉన్నాయి. ఆటుపోట్లు కూడా క్రమంగా తగ్గి, ప్రైస్‌ యాక్షన్‌, మూమెంటం పుంజుకుంది. గత వారం రూ.1,210 వద్ద ముగిసిన ఈ షేరు 21 రోజుల ఈఎంఏ వద్ద మద్దతు తీసుకుంది. రూ.1,260/1,320 టార్గెట్‌ ధరతో ఈ కౌంటర్లో రూ.1,200 స్థాయిలో పొజిషన్లు తీసుకోవచ్చు.

స్టాప్‌లాస్‌: రూ.1,175

ఎస్‌బీఐ లైఫ్‌: ప్రస్తుతం ఈ కౌంటర్‌ చాలా బలంగా కనిపిస్తోంది. షార్ట్‌, మీడియం, లాంగ్‌ టర్మ్‌ మూమెంటం బాగుంది. నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోంది. గత వారం 2.2 శాతం లాభంతో రూ.1,798 వద్ద ముగిసింది. రూ.1,885 టార్గెట్‌తో రూ.1,780-1,790 మధ్య మదుపరులు ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు.


స్టాప్‌లాస్‌: రూ..1,760

సీడీఎ్‌సఎల్‌: గత వారం సీడీఎ్‌సఎల్‌ షేర్లు రూ.1,462 వద్ద ముగిశాయి. గత ఏడాది డిసెంబరు నుంచి దిద్దుబాటులో ఉన్న ఈ షేర్లు ప్రస్తుతం కన్సాలిడేషన్‌ చివరి దశకు చేరుకున్నాయి. గత ఐదు సెషన్స్‌లో ప్రైస్‌ యాక్షన్‌ టైట్‌గా సాగింది. రిలెటివ్‌ స్ట్రెంత్‌, మూమెంటమ్‌ బాగున్నాయి. రూ.1,520/1,580 టార్గెట్‌తో మదుపరులు రూ.1,450 స్థాయిలో ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు.

స్టాప్‌లాస్‌ : రూ.1,425ను

హెచ్‌సీఎల్‌ టెక్‌: జనవరి నుంచి దిద్దుబాటులో ఉన్న ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం కీలక స్థాయికి చేరా యి. 20, 50 రోజుల ఈఎంఏ వద్ద మద్దతు తీసుకుని అక్కడే చలిస్తున్నాయి. మూమెంటం సైతం బాగుంది. గత వారం రూ.1,648 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.1,690/1,729 టార్గెట్‌తో రూ.1,640 వద్ద పొజిషన్లు తీసుకోవచ్చు.

స్టాప్‌లాస్‌ : రూ.1,610

కోల్‌ ఇండియా: గత ఏడాదిగా పతనమవుతున్న ఈ కంపెనీ షేర్లు ఈ ఏడాది జనవరి నుంచి అక్యుములేషన్‌ దశకు చేరుకున్నాయి. గత వారం రూ.401 వద్ద ముగిశాయి. ప్రస్తుతం 20, 50 రోజుల ఈఎంఏ పై స్థారులో ట్రేడవుతున్నాయి. మూమెంటం కూడా బాగుంది. రూ.440/470 టార్గెట్‌తో మదుపరులు రూ.380/390 మధ్య ఈ కౌంటర్లో పొజిషన్లు తీసుకోవచ్చు.

స్టాప్‌లాస్‌ : రూ.360

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:48 AM