ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కెనరా బ్యాంక్‌ యూబీఐ ఐఓబీ రుణ రేట్లు తగ్గింపు

ABN, Publish Date - Jun 12 , 2025 | 04:19 AM

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ).. రుణాలపై వడ్డీరేట్లను 0.50 శాతం...

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ).. రుణాలపై వడ్డీరేట్లను 0.50 శాతం తగ్గించాయి. రుణాలకు ప్రామాణికమైన ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటుతో (ఈబీఎల్‌ఆర్‌) పాటు రెపో అనుసంధానిత రుణ రేటును (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) అర శాతం తగ్గించినట్లు బుధవారం నాటి ప్రకటనలో యూబీఐ తెలిపింది. అలాగే ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 0.50 శాతం తగ్గిస్తున్నట్లు ఐఓబీ వెల్లడించింది. దాంతో బ్యాంక్‌ రుణ రేటు 8.85 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గనుంది. గురువారం నుంచి ఈ రేటు అమలులోకి రానుంది.

కెనరా బ్యాంక్‌: కెనరా బ్యాంక్‌ కూడా ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 0.50 శాతం తగ్గించినట్టు ప్రకటించింది. దాంతో బ్యాంక్‌ రుణరేటు 8.75 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గనుంది. గురువారం నుంచి ఈ రేటు అమలులోకి రానుంది. ఆర్‌బీఐ రెపోరేటును గత శుక్రవారం 0.50 శాతం తగ్గించడంతో పలు బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు పంచుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 04:19 AM