ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రల పీఎస్ యూల కోసం కాగ్‌ ప్రత్యేక యూనిట్‌

ABN, Publish Date - Jun 16 , 2025 | 01:26 AM

వివిధ రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో పని చేస్తున్న 1,600 ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) కోసం కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) కార్యాలయం ప్రత్యేక...

న్యూఢిల్లీ: వివిధ రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలో పని చేస్తున్న 1,600 ప్రభుత్వ రంగ సంస్థల (పీఎ్‌సయూ) కోసం కంప్ర్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) కార్యాలయం ప్రత్యేక ఆడిటింగ్‌ విభాగం ఏర్పాటు చేసింది. దీనివల్ల ఆయా సంస్థల ఆడిట్‌ వేగంగా పూర్తి చేయగలుగుతారు. తద్వారా అవి మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతాయి. ఇప్పటికే ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఆ విభాగం ఏర్పాటు కాగానే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని పీఎ్‌సయూలన్నీ ఆ విభాగం పరిధిలోకి వస్తాయని డిప్యూటీ సీఏజీ కేఎస్‌ సుబ్రమణియన్‌ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర పీఎ్‌సయూలను సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ సభ్యులు ఆడిట్‌ చేస్తున్నారని, వీరు కనీసం 4-5 రాష్ర్టాల పీఎ్‌సయూలను ఆడిట్‌ చేయాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలో 700 వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎ్‌సఈ), 1600 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (ఎస్‌పీఎస్‌ఈ), 485 స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర సంస్థలు, 700 స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర సంస్థలు ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

సెంట్రల్ బ్యాంకులో 4,500 జాబ్స్.. అర్హతలు ఎలా ఉన్నాయంటే..

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 01:26 AM