ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Buy Used Cars: సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ABN, Publish Date - Jun 03 , 2025 | 10:38 PM

యూజ్డ్ కార్లు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.

Used Car Buying Guide

మీ బడ్జెట్ రూ.6 నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటే మారుతీ ఆల్టో లాంటి ఎంట్రీ లెవెల్ కార్లు మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే, ఈ బడ్జెట్‌లోనే ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకుంటే సెకెండ్ హ్యాండ్ కార్లు కొనుగోలే బెటర్. మంచి డీలర్ వద్ద అన్ని విషయాలు చెక్ చేసుకున్నాక యూజ్డ్ కారు తీసుకుంటే తక్కువ ధరకే నచ్చిన కారు సొంతం చేసుకోవచ్చు. మరి యూజ్డ కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

సెకెండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేందుకు మీరు నేరుగా నెట్టింట జల్లెడ పట్టొచ్చు. యాడ్స్ ఆధారంగా కారును ఎంచుకుని, వాహనం కండీషన్ స్వయంగా పరిశీలించుకుని అన్నా ఓకే అనుకున్నాకే కొనుగోలు చేయొచ్చు. ఇక అనేక ఆన్‌లైన్ ఆఫ్ లైన్ సంస్థలు కూడా సెకెండ్ హ్యాండ్ కార్లను వారెంటీతో సహా విక్రయిస్తున్నాయి. పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌ లెవెల్‌లో కారును రిఫర్బిష్ చేసి ఇస్తున్నాయి. లోన్‌లు కూడా ఇస్తున్నాయి. అయితే, ఇలాంటి కార్లు కాస్త రేటెక్కువ. వారంటీకోసం అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.


సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేటప్పుడు బాడీ ఇన్‌స్పెక్షన్ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాక్టరీ పెయింట్ ఉందా లేదా కారును మెరిసిపోయేలా చేసేందుకు ఆఫ్టర్ మార్కెట్ పెయింట్ వారా అన్నది గమనించాలి. బంపర్, ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడా పెయింట్ పోవడాన్ని పట్టించుకోనక్కర్లేదు. హెడ్‌లైట్స్ టెయిల్ లైట్స్ వంటివి కూడా కొత్తగా కనిపిస్తున్నాయంటే కారుకు భారీగా సొట్టపడి రిపేర్ చేసి ఉండొచ్చని భావించాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. బ్యాడ్జ్‌లు కొన్ని లేకపోయినా ఓవర్‌స్ప్రే చేసినట్టు కనిపిస్తున్నా కారుకు పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టే.

కారులోపల కూడా బాగా చెక్ చేయాలి. డ్యాష్ బోర్డు బాగా రంగు వెలిసి నట్టు కనిపిస్తే వాహనాం ఎక్కువ కాలం పాటు వినియోగించినట్టే. అయితే, డీలర్‌షాపులో ఉండే కార్లలో ఈ లోపాలను రిపేర్ చేసేస్తారు. కారు సీటు కవర్‌లు కొత్తగా మెరిసిపోతున్నాంటే సీట్లు బాగా డ్యామేజ్ అయి ఉండొచ్చని అనుమానించాలి. ఫ్లోర్ మ్యాట్స్‌ను తొలగించి కారు ఛాసిని చెక్ చేస్తే కూడా అసలు విషయం అర్థమవుతుంది.


ఎక్కువగా వినియోగించని కారు టైర్లను కూడా ఇదే రీతిలో ఉంటాయి. కాబట్టి, ముందుగా కారు టైర్లు బాగా అరిగిపోయినట్టు ఉన్నాయో లేదో చెక్ చేయాలి.25 వేల కిలోమీటర్లు ప్రయాణించిన కారు టైర్లు మరీ కొత్తగా కనిపిస్తున్నాయంటే ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టే. ఇంజెన్ బే బాగా తుప్పు పట్టి ఉన్నదీ లేనిదీ కూడా కారు ఎంత పాతతో చెప్పేస్తుంది. హెడ్‌గాస్కెట్, ఇంజెన్ రిపేర్లు ఏస్థాయిలో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. వైరింగ్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కూడా చెక్ చేయాలి.

ఇంజెన్‌ను కోల్డ్ స్టార్ట్ చేసి టెస్ట్ డ్రైవ్‌కు తీసుకెళ్లాలి. ఇంజెన్ శబ్దాలను నిశితంగా పరిశీలించాలి. సెల్ఫ్ స్టార్ట్ చేయగానే ఇంజెన్ ఆన్ కావాలి. ఎక్కువ సేపు టైమ్ తీసుకుంటోందంటే సమస్య ఉన్నట్టే. ఇంజెన్ ఐడిల్‌లో శబ్దం ఎలా ఉందో చూడాలి. భారీ శబ్దాలు లేదా అసహజమైన చప్పుళ్లు వినిపిస్తున్నాయంటే ఇంజెన్ కొనకపోవడమే మంచిది. క్లచ్ అరిగిపోయినట్టు అనిపిస్తే కారును లైట్ తీసుకోవడమే మంచిది. కీచు మనే శబ్దం లేకుండా బ్రేక్ పని చేస్తోందో లేదో చెక్ చేయాలి. ఇలా అన్నీ చూసుకున్నాకే యూజ్డ్ కారు కొనుగోలు చేయాలి.

Updated Date - Jun 06 , 2025 | 04:06 PM