పడితే కొనుగోలు చేసే వ్యూహం బెటర్
ABN, Publish Date - May 19 , 2025 | 04:37 AM
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం నిఫ్టీ 25,000 పైన ముగియటం పాజిటివ్ సెంటిమెంట్‌ను నింపుతోంది....
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం నిఫ్టీ 25,000 పైన ముగియటం పాజిటివ్ సెంటిమెంట్‌ను నింపుతోంది. ప్రస్తుతం రక్షణ, షిప్ బిల్డింగ్, రైల్వే, ఏవియేషన్, చమురు, గ్యాస్ సరఫరా, డైమండ్, జువెలరీ రంగాలకు చెందిన షేర్లు బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. మీడియా, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఐటీ రంగాల్లో అంతగా మూమెంటమ్ కనిపించటం లేదు. ఇన్వెస్టర్లు నాణ్యమైన షేర్లను బై ఆన్ డిప్స్ పద్దతిలో కొనుగోలు వ్యూహాన్ని పాటించటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
టాటా టెక్నాలజీస్: గత ఏడాది సెప్టెంబరు నుంచి డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ కౌంటర్‌లో ప్రస్తుతం అక్యుములేషన్ జరుగుతోంది. షార్ట్‌టర్మ్ మూమెంటమ్, వాల్యూమ్ క్రమంగా పెరుగుతున్నాయి. పైగా నెల రోజుల గరిష్ఠాన్ని బ్రేక్ చేశాయి. గత శుక్రవారం 4.3 శాతం లాభంతో రూ.750 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.740 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.810/900 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.710 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
ఆర్‌వీఎన్‌ఎల్: ఏడాది కాలంగా డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తున్న ఈ షేరులో ప్రస్తుతం మూమెంటమ్ పెరిగింది. బేస్‌తో పాటు 20, 50 రోజుల సగటు ధరను అధిగమించింది. గత శుక్రవారం ఈ షేరు 8.9 శాతం లాభంతో రూ.409 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.400 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.425/440 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.385 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: సుదీర్ఘకాలంగా పతనమవుతూ వస్తున్న ఈ కౌంటర్‌లో ప్రస్తుతం మంచి బేస్ ఏర్పడింది. గత శుక్రవారం 5.8 శాతం లాభంతో రూ.730 వద్ద క్లోజయి గత నెల గరిష్ఠ స్థాయిని అధిగమించింది. రిలేటివ్ స్ట్రెంత్ కూడా పెరుగుతోంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.700 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.810 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.775 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మోతీలాల్ ఓస్వాల్: ప్రస్తుతం ఈ కౌంటర్‌లో మూమెంటమ్, రిలేటివ్ స్ట్రెంత్ పెరుగుతున్నాయి. జనవరి నుంచి కొనసాగిన పతనం ముగిసింది. అక్యుములేషన్ కొనసాగుతోంది. పైగా నెల రోజుల గరిష్ఠాన్ని అధిగమించింది. గత శుక్రవారం 3.8 శాతం లాభంతో రూ.789 వద్ద క్లోజైన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.780 శ్రేణిలో ఎంటరై రూ.850/890 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.750 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
సీజీ పవర్: ప్రస్తుతం ఈ షేరు అక్యుములేషన్ ముగింపు దశలో ఉంది. షార్ట్, మిడ్ టర్మ్‌లో మూమెంటమ్ ప్రదర్శిస్తున్నాయి. 20, 50 రోజుల మూవింగ్ యావరేజె్‌సను అధిగమించింది. గత శుక్రవారం 2.7 శాతం లాభంతో రూ.696 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.690 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.770/800 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.670 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి
UPI New Rule: యూపీఐ కొత్త రూల్.. తప్పు చెల్లింపుల కట్టడి కోసం కీలక సౌకర్యం..
Jyoti Malhotra Case: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి షాకింగ్ ఫాక్ట్స్
Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
EPFO: ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 04:37 AM