Hyderabad Real Estate: హైదరాబాద్‌లో బ్రిగేడ్ గ్రూప్ కొత్త ప్రాజెక్టులు
ABN, Publish Date - Jul 30 , 2025 | 04:54 AM
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ఠ బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్‌లో మరో రెండు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు చేపట్టింది. నగరంలోని మోతీనగర్...
రూ.970 కోట్ల ఆదాయానికి అవకాశం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ఠ బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్‌లో మరో రెండు లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు చేపట్టింది. నగరంలోని మోతీనగర్ ప్రాంతంలో పది ఎకరాల్లో ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టినట్టు తెలిపింది. ఈ గ్రూప్ ఇప్పటికే మోతీనగర్‌లో బ్రిగేడ్ సిటాడెల్ పేరుతో ఒక ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీనికి సమీపంలోనే బ్రిగేడ్ సిటాడెల్ 2, సిటాడెల్ 3 పేరుతో 10 లక్షల ఎస్‌ఎ్‌ఫటీలో మరో రెండు రెసిడెన్షియల్ ప్రాజెక్టులు చేపడుతోంది.
ప్రాజెక్టు ప్రత్యేకతలు
10 లక్షల ఎస్‌ఎ్‌ఫటీలో 405 లగ్జరీ 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు.
రూ.970 కోట్ల ఆదాయానికి అవకాశం
రెండు ప్రాజెక్టుల్లోనూ అత్యాధునిక సదుపాయాలు.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏసీసీ క్లారిటీ..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 30 , 2025 | 04:55 AM