ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్విక్‌ ఫుడ్‌ సేవల్లోకి బిగ్‌బాస్కెట్‌

ABN, Publish Date - Jun 11 , 2025 | 03:08 AM

టాటా గ్రూప్‌నకు చెందిన ఆన్‌లైన్‌ కిరాణా ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్కెట్‌ కూడా క్విక్‌ కామర్స్‌ సేవల్లోకి పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతోంది...

  • స్విగ్గీ, జొమాటో, జెప్టోతో పోటీకి సిద్ధం

  • వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్త విస్తరణ

బెంగళూరు: టాటా గ్రూప్‌నకు చెందిన ఆన్‌లైన్‌ కిరాణా ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్కెట్‌ కూడా క్విక్‌ కామర్స్‌ సేవల్లోకి పూర్తి స్థాయిలో రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతోంది. నెల క్రితం బెంగళూరులో ప్రారంభించిన ‘10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివరీ’ సేవలను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి (2026 మార్చి) దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నట్లు బిగ్‌ బాస్కెట్‌ సహ వ్యవస్థాపకులు విపుల్‌ పరేఖ్‌ తెలిపారు. దీంతో బిగ్‌బాస్కెట్‌.. స్విగ్గీ స్నాక్‌, జొమాటో క్విక్‌కామర్స్‌ విభాగమైన బ్లింకిట్‌ బిస్ట్రో, జెప్టో కేఫ్‌కు పోటీనివ్వనుంది. క్విక్‌ ఫుడ్‌ సేవల కోసం ప్రస్తుత 700 డార్క్‌ స్టోర్ల (గిడ్డంగులు) సంఖ్యను ఈ ఏడాది చివరి నాటికి 1000-1200కు పెంచుకోవాలని నిర్ణయించింది.

ర్యాపిడో కూడా వచ్చేస్తోంది..

ఓలా, ఉబెర్‌కు పోటీగా బైక్‌, క్యాబ్‌ సర్వీసులందిస్తోన్న ర్యాపిడో కూడా స్విగ్గీ, జొమాటోకు సవాలు విసురుతోంది. ఓన్లీ పేరుతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలను పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద తొలుత బెంగళూరులో ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో సేవలను ఆరంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఆహారోత్పత్తులను రెస్టారెంట్‌లో లభించే ధరకే కస్టమర్‌ ఇంటి వద్దకు సరఫరా చేయనున్నట్లు ర్యాపిడో ప్రకటించింది.


ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 11 , 2025 | 03:08 AM