కలరా వ్యాక్సిన్ హిల్‌కాల్
ABN, Publish Date - May 22 , 2025 | 05:32 AM
భారత్ బయోటెక్ త్వరలో మరో వినూత్న వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. కలరా మహమ్మారిని అడ్డుకునేందుకు కంపెనీ అభివృద్ధి చేస్తున్న...ఇవీ చదవండి: Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.. Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
ఫేజ్-3 పరీక్షలు విజయవంతం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారత్ బయోటెక్ త్వరలో మరో వినూత్న వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. కలరా మహమ్మారిని అడ్డుకునేందుకు కంపెనీ అభివృద్ధి చేస్తున్న ‘హిల్‌కాల్’ వ్యాక్సిన్ మూడో దశ (ఫేజ్-3) పరీక్షలు 1,800 మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్టు వెల్లడించింది. దేశంలోని 10 కేంద్రాల్లో 1,800 మందిని వారి వయసు ఆధారంగా మూడు గ్రూపులుగా విభజించి కంపెనీ ఈ పరీక్షలు పూర్తి చేసింది. ‘వ్యాక్సిన్లు అవసరమైన వ్యక్తులకు అందుబాటు ధరల్లో, సమర్ధవంతమైన వ్యాక్సిన్లను అందజేయాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం’ అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు. కలరా సోకకుండా ముందు జాగ్రత్త్తగా నోటి ద్వారా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. ప్రస్తుతం ఏటా ప్రపంచవ్యాప్తంగా 28.6 లక్షల మంది కలరా బారిన పడుతుంటే వారిలో 95,000 మంది మృత్యువాత పడుతున్నారు.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 22 , 2025 | 05:32 AM