ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Real Estate Loans: రియల్టీతో బ్యాంకుల రుణానుబంధం

ABN, Publish Date - Jul 30 , 2025 | 05:22 AM

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి బ్యాంకుల రుణ విత రణ గత నాలుగేళ్లలో రెట్టింపై 2025 మార్చి నాటికి రూ.35.4 లక్షల కోట్లకు చేరింది. రియల్టీ కన్సల్టెంట్‌ కోలియెర్స్‌ తాజా నివేదికలో...

నాలుగేళ్లలో రుణవితరణ రెట్టింపు: కోలియెర్స్‌

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి బ్యాంకుల రుణ విత రణ గత నాలుగేళ్లలో రెట్టింపై 2025 మార్చి నాటికి రూ.35.4 లక్షల కోట్లకు చేరింది. రియల్టీ కన్సల్టెంట్‌ కోలియెర్స్‌ తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది. రియల్టీ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న టాప్‌ 50 లిస్టెడ్‌ కంపెనీల లాభదాయకత, అవి ప్రదర్శిస్తున్న వేగం, మార్కెట్లో వాటి స్థాయి వంటి వి మదింపు చేసి ఈ నివేదిక రూపొందించినట్లు కోలియెర్స్‌ తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో రియల్టీ రంగానికి స్థూల బ్యాంకు రుణాలు రూ.17.8 లక్షల కోట్లుండగా ఈ ఏడాది మార్చి నాటికి రూ.35.4 లక్షల కోట్లకు చేరినట్టు తెలియచేసింది. తీవ్ర ఆటుపోట్ల మధ్యన కూడా ఈ రంగం ఆర్థిక స్వస్థత ఎంతగానో మెరుగుపడిందని, ఆర్థిక రంగంలోని ఇత ర విభాగాల కన్నా మెరుగైన పనితీరు ప్రదర్శిస్తోందని పేర్కొంది. బ్యాంకులు అందిస్తున్న మొత్తం రుణాల్లో సుమా రు ఐదింట ఒక శాతం రియల్టీ రంగానికే అందుతున్నట్టు తెలిపింది. ఇతర రంగాల్లోని కంపెనీలతో పోల్చితే పరపతి రేటింగ్‌ పెంచుకున్న కంపెనీల్లో రియల్టీ రంగానికి చెందినవే అధికంగా ఉన్నట్టు కోలియెర్స్‌ సీఈఓ బాదల్‌ యాజ్ఞిక్‌ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో టాప్‌ 50 కంపెనీల్లో 62ు కంపెనీల లాభదాయకత పెరిగిందని, 60 శాతం పైగా కంపెనీల రుణభార స్థాయిలు కూడా సౌకర్యవంతంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

వృద్ధిపై ఆశావహ దృక్పథం

రాబోయే ఆరు నెలల కాలానికి దేశీయ ప్రాపర్టీ మార్కెట్‌ వృద్ధిపై రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు, ఆర్థిక సంస్థలు ఆశావహ దృక్పథంతో ఉన్నట్టు నరెడ్కో, నైట్‌ఫ్రాంక్‌ అధ్యయనంలో తేలింది. మంగళవారం ఈ సంస్థలు 45వ ఎడిషన్‌ రియల్‌ ఎస్టేట్‌ సెంటిమెంట్‌ ఇండెక్స్‌ను విడుదల చేశాయి. నాలుగు త్రైమాసికాల పతన క్రమానికి స్వస్తి చెప్పిన ఈ సూచీ జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చితే ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 54 పాయింట్ల నుంచి 56 పాయింట్లకు పెరిగింది. రియల్టీ రంగంలో పెరిగిన ఆశావహ వైఖరికి ఇది దర్పణమని నరెడ్కో ప్రెసిడెంట్‌ హరిబాబు అన్నారు.

ఇండస్ర్టియల్‌, వేర్‌హౌసింగ్‌ జోరు

ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో దేశంలో ఇండస్ర్టియల్‌, వేర్‌హౌసింగ్‌ విభాగాల లీజింగ్‌ 63% వృద్ధితో 2.71 కోట్ల చదరపు అడుగులకు పెరిగినట్టు సీబీఆర్‌ఈ తెలిపింది. ప్రధానంగా 25 శాతం వాటాతో ఇ-కామర్స్‌ కంపెనీలు డిమాండులో వృద్ధికి దోహదపడినట్టు తెలియచేసింది. ద్వితీయ శ్రేణి నగరాల్లో డిమాండ్‌ మరింతగా పెరిగినట్టు కంపెనీ సీఈఓ, చైర్మన్‌ అన్షుమన్‌ మాగజైన్‌ అన్నారు. నగరాలవారీగా చూసినట్టయితే 73 లక్షల చదరపు అడుగులతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ అగ్రస్థానంలో నిలిచింది. 36 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‎పై ఏసీసీ క్లారిటీ..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 05:22 AM