Financial Performance: యాక్సిస్ బ్యాంక్‌కు మొండిబాకీల సెగ
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:59 AM
జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4 శాతం తగ్గి రూ.5,806 కోట్లకు పరిమితమైంది. మొండి బకాయిలు (ఎన్‌పీఏ) స్వల్పంగా పెరగడం...
న్యూఢిల్లీ: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4 శాతం తగ్గి రూ.5,806 కోట్లకు పరిమితమైంది. మొండి బకాయిలు (ఎన్‌పీఏ) స్వల్పంగా పెరగడం ఇందుకు కారణమైంది. సమీక్షా కాలంలో బ్యాంక్ మొత్తం ఆదాయం మాత్రం రూ.38,322 కోట్లకు పెరిగింది. అందులో వడ్డీ ఆదాయం రూ.31,064 కోట్లుగా నమోదైంది. గత ఏడాది జూన్ 30 నాటికి 1.54 శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏలు ఈ జూన్ చివరి నాటికి 1.57 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 0.34 శాతం నుంచి 0.45 శాతానికి ఎగబాకాయి. ఈ కాలంలో బ్యాంక్ మొండిబకాయిలతో పాటు ఇతర అవసరాలకు రూ.3,948 కోట్లను కేటాయించింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 18 , 2025 | 05:59 AM