ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Auto Market: ఆటో ఎగుమతుల జోరు

ABN, Publish Date - Jul 21 , 2025 | 02:51 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఆటోమొబైల్‌ ఎగుమతులు 22 శాతం వృద్ధి చెందినట్లు భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) వెల్లడించింది...

క్యూ1లో 22 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఆటోమొబైల్‌ ఎగుమతులు 22 శాతం వృద్ధి చెందినట్లు భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం ఎగుమతులు 14,57,461 యూనిట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 11,92,566 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్‌ వాహన ఎగుమతులు రికార్డు స్థాయికి చేరటంతో పాటు ద్విచక్ర, వాణిజ్య వాహన విభాగాల్లో బలమైన పెరుగుదల ఈ వృద్ధికి కారణమని సియామ్‌ పేర్కొంది. జూన్‌ త్రైమాసికంలో ప్యాసింజర్‌ వాహన ఎగుమతులు 2,04,330 యూనిట్లుగా ఉన్నాయి. పశ్చిమాసియా సహా అమెరికా మార్కెట్లలో స్థిరమైన డిమాండ్‌ కారణంగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపింది. ఈ కాలంలో ద్విచక్ర, వాణిజ్య వాహన ఎగుమతులు 23 శాతం వృద్ధితో వరుసగా 11,36,942 యూనిట్లు, 19,427 యూనిట్లుగా ఉన్నాయి. జూన్‌ త్రైమాసికంలో దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 96,181 యూనిట్లను ఎగుమతి చేసి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ఐదేళ్లలో 30% మార్కెట్‌ వాటా లక్ష్యం: హెచ్‌ఎంఎ్‌సఐ

2030 నాటికి దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో వాటా 30 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ మార్కె ట్లో 27 శాతం వాటాతో హోండా రెండో స్థానంలో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 1.88 కోట్ల యూనిట్లుగా ఉండగా హోండా మోటార్‌సైకిల్‌ విక్రయాలు 47.89 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. కాగా హీరో మోటోకార్ప్‌ 54.45 లక్షల యూనిట్ల విక్రయాలతో అగ్రస్థానంలో ఉంది.

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 21 , 2025 | 02:51 AM