అరబిందో ఫార్మా లాభం రూ 824 కోట్లు
ABN, Publish Date - Aug 05 , 2025 | 05:34 AM
వర్తమాన ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి అరబిందో ఫా ర్మా లాభం 10ు తగ్గి రూ.824 కోట్ల కు పడిపోయింది. అమెరికా మార్కెట్లోను, ఏపీఐ విభాగంలోను అమ్మకాలు....
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): వర్తమాన ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికానికి అరబిందో ఫా ర్మా లాభం 10ు తగ్గి రూ.824 కోట్ల కు పడిపోయింది. అమెరికా మార్కెట్లోను, ఏపీఐ విభాగంలోను అమ్మకాలు తగ్గడం ఇందుకు కారణం. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే కంపెనీ లాభం రూ.918 కోట్లుంది. ఆదాయం మాత్రం రూ.7,567 కోట్ల నుంచి రూ.7,868 కోట్లకు పెరిగింది. సోమవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో రూపాయి ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.4 మధ్యంతర డివిడెండుకు (400ు) ఆమోదం తెలిపారు. డివిడెండు చెల్లింపునకు రికార్డు తేదీని ఆగస్టు 8గా నిర్ణయించారు. తమ యూరోపియన్ వ్యాపారాల్లో బలమైన వృద్ధి నమోదవుతోందని, అమెరికా వ్యాపారాలు మాత్రం ఆటుపోట్లను తట్టుకుంటూ నిలదొక్కుకున్నాయని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కే.నిత్యానంద రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 05 , 2025 | 05:34 AM