ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా... మీ జేబుకి చిల్లే

ABN, Publish Date - Mar 26 , 2025 | 04:08 AM

ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం సామాన్య మానవులకి మరింత భారం కానుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రాయల్‌పై ఇంటర్‌ చేంజ్‌ ఫీజు పెంచడమే...

మే 1 నుంచి కొత్త చార్జీలు

ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం సామాన్య మానవులకి మరింత భారం కానుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రాయల్‌పై ఇంటర్‌ చేంజ్‌ ఫీజు పెంచడమే ఇందుకు కారణం. మే ఒకటో తేదీ నుంచి ఈ కొత్త చార్జీలు అమలులోకి వస్తాయని దూరదర్శన్‌ ఒక నివేదికలో తెలిపింది. తమ కస్టమర్లకు ఏటీఎం సేవలందిస్తున్నందుకు ఏదైనా బ్యాంకు.. ఏటీఎం నడుపుతున్న బ్యాంకుకు చెల్లించే ఫీజునే ఇంటర్‌ చేంజ్‌ ఫీజుగా వ్యవహరిస్తారు. నిర్వహణ వ్యయాలు పెరిగిపోయిన కారణంగా ఏటీఎం విత్‌డ్రాయల్‌ చార్జీలు పెంచాలన్న వైట్‌ లేబుల్‌ ఏటీఎం ఆపరేటర్లు చేసిన అభ్యర్థన మేరకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీడీ తెలిపింది.

ఎంత భారం పడుతుంది?

సాధారణంగా ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు నిర్దిష్ట పరిమితిలో ఉచిత ఏటీఎం విత్‌డ్రాయల్‌ సదుపాయం అందిస్తోంది. ఆ ఉచిత విత్‌డ్రాయల్‌ పరిమితి దాటి చేసే ఏ లావాదేవీపై అయినా ఈ అదనపు భారం తప్పదు. గతంలో ఒక్కో ఆర్థిక లావాదేవీకైతే (ఏటీఎం విత్‌డ్రాయల్‌) ఒక్కో దానిపై రూ.17 ఫీజు వసూలు చేసే వారు. దీన్ని తాజాగా రూ.19కి పెంచారు. నాన్‌ ఫైనాన్షియల్‌ లావాదేవీకైతే (బ్యాలెన్స్‌ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్‌ వంటివి) ఒక్కో దానిపై రూ.6 వసూలు చేసే వారు. దీన్ని రూ.7కి పెంచారు. ప్రధానంగా చిన్న బ్యాంకుల కస్టమర్లపై ఈ భారం అధికంగా ఉంటుంది. ఏటీఎం మౌలిక వసతులు, సేవల కోసం చిన్న బ్యాంకులు పెద్ద ఆర్థిక సంస్థలపై ఆధారపడుతూ ఉండడమే ఇందుకు కారణం.


ఉచిత లావాదేవీలెన్ని ..

2014 అక్టోబరు 10వ తేదీన ఆర్‌బీఐ జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం మెట్రో నగరాల్లో (ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌) ఒక బ్యాంకు కస్టమర్లు మరో బ్యాంక్‌ ఏటీఎం వద్ద చేసే ఉచిత లావాదేవీల సంఖ్య (ఫైనాన్షియల్‌, నాన్‌ ఫైనాన్షియల్‌ లావాదేవీలన్నీ కలిపి) నెలకి 5 నుంచి 3కి తగ్గింది. ఈ నగరాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో అయితే నెలకి 5 ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్నారు. అయితే ఫెయిల్‌ అయిన లావాదేవీలను మాత్రం అధీకృత లావాదేవీగా పరిగణించవద్దని కూడా ఆర్‌బీఐ బ్యాంకులకు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:08 AM